Perni Nani: చిరంజీవిది పెద్ద మనసు.. ప్రభుత్వం దృష్టికి సమస్యలు- మంత్రి పేర్నినాని

తెలుగు సినిమా సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకుని రావటానికి చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, వారికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి పేర్ని నాని.

Ap Minister Perni Nani

Perni Nani: తెలుగు సినిమా సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకుని రావటానికి చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, వారికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి పేర్ని నాని.

ఏది పడితే అది మాట్లాడినా కూడా పెద్ద మనసుతో చిరంజీవి ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకుని వచ్చారని చెప్పారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని.

ఫిబ్రవరి నెలాఖరుకి సమావేశంలో మాట్లాడకున్న ప్రతి అంశానికి కార్యరూపం వస్తుందని చెప్పారు పేర్ని నాని. సీఎం జగన్ కూడా చిన్న సినిమాలు బ్రతకాలి అని చెప్పారని, వెంటనే ఇండస్ట్రీ పెద్దలు సానుకూల నిర్ణయం తీసుకుంటారని అన్నారు

పరిశ్రమకు ఏం కావాలో ఇండస్ట్రీ లిస్ట్ సిద్ధం చేయాలని, ప్రభుత్వం కూడా చేస్తుందని, విశాఖ వేదికగా సినిమా హబ్‌ని చేసేందుకు అన్ని విధాలుగా దృష్టి సారించామని అన్నారు పేర్ని నాని.