సీసీరోడ్ల నిర్మాణం కోసం ఘర్షణ…పోలీసుల లాఠీచార్జ్.. స్పృహ కోల్పోయిన ముగ్గురు మహిళలు

Clash Construction Cc Roads Srikakulam 3338

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చర్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఇరు వర్గాలు కొట్లాటకు దిగాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

పోలీసుల దెబ్బలకు ముగ్గురు మహిళలు స్పృహ కోల్పోయారు. దీంతో రెచ్చిపోయిన ఓ వర్గం పోలీసులపై తిరగబడింది. ప్రత్యర్థి వర్గానికి పోలీసులు సపోర్టు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.