Hindupuram Ysrcp Clashes
Hindupuram YSRCP Clashes : హిందూపురం వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. నేతల మధ్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణలతో హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ ఇక్బాల్, రామకృష్ణారెడ్డి మధ్య ఆధిపత్య పోరు ముదిరింది. శుక్రవారం ఉదయం కౌన్సిలర్ ఇర్షాద్ పై ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులు దాడి చేశారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
ఎమ్మెల్సీ తీరుని నిరసిస్తూ 18 మంది కౌన్సిలర్లు, చౌలూరి రామకృష్ణారెడ్డితో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ ను ఎమ్మెల్సీ ఇక్బాల్, అతడి అనుచరులు అడ్డుకున్నారు. కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో రెండువర్గాల మధ్య తోపులాట జరిగింది. కౌన్సిలర్లపై ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులు రాళ్లు రువ్వారు.