Movie Theaters : అనంతపురంలో నాలుగు థియేటర్లను స్వచ్ఛందంగా మూసేసిన యజమానులు

ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనలు పాటించని థియేటర్లపై అధికారులు కోరాడ జుళిపిస్తున్నారు. లైసెన్సులు పునరుద్ధరణ కానీ థియేటర్లకు నోటీసులు అందిస్తున్నారు అధికారులు.

Movie Theaters

Movie Theaters : ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనలు పాటించని థియేటర్లపై అధికారులు కోరాడ జుళిపిస్తున్నారు. లైసెన్సులు పునరుద్ధరణ కానీ థియేటర్లకు నోటీసులు అందిస్తున్నారు అధికారులు. గురువారం చిత్తూరు జిల్లాలో 37 థియేటర్లకు .. “మదనపల్లిలో 7, కుప్పంలో 4, వి కోట 3, బి.కొత్తకోట 2, పీలేరు 4, పుంగనూరు 4, పలమనేరు 4, రొంపిచర్ల 2, కలికిరి 2, సదుం మొలకల చెరువు, గుర్రంకొండ, కలకడ, తంబల్ల పల్లి”లలో థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. మరో 11 థియేటర్లను సీజ్ చేశారు.

చదవండి : Theaters Close: థియేటర్ల మూసివేతతో అభిమానుల్లో నిరాశ

మరోవైపు అనంతపురం జిల్లా నాలుగు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. ఏపీలో నిబంధనలు పాటించని థియేటర్లపై అధికారులు కొరడా ఝుళిపిస్తుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు థియేటర్ల యజమానులు. పెనుకొండలో మూడు థియేటర్లు, గోరంట్లలో ఓ థియేటర్‌ను స్వచ్ఛందంగా మూసివేశారు ఓనర్లు.

చదవండి : Theaters Seized : ఏపీలో కొనసాగుతున్న తనిఖీలు.. కృష్ణా జిల్లాలో 12 సినిమా థియేటర్లు సీజ్

అనంతపురం నగరంలో సినిమా హాళ్లను జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తినుబండారాలు, టిక్కెట్ విక్రయాలు చేయాలని సూచించారు. థియేటర్లలోనే ప్రేక్షకుల అవసరాల నిమిత్తం అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని ఆరా తీశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని థియేటర్ నిర్వాహకులను హెచ్చరించారు.

చదవండి : Theaters seize: రూల్స్ బ్రేక్ చేసిన సినిమా థియేటర్లు సీజ్

మరోవైపు సినీ పరిశ్రమకు, ఏపీప్రభుత్వానికి మధ్య టికెట్ రేట్ల విషయంపై వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను నిర్ణయించగా.. ఈ ధరలతో తాము సినిమాలు నడపలేమని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. టికెట్ ధరలు పెంచాలని కోరుతున్నారు.