Theaters Seized : ఏపీలో కొనసాగుతున్న తనిఖీలు.. కృష్ణా జిల్లాలో 12 సినిమా థియేటర్లు సీజ్

ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సైతం తనిఖీలు చేపట్టారు. పెద్ద హీరోల సినిమాలకు, పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే చర్యలు తప్పవని అధికారులు అంటున్నారు.

Theaters Seized : ఏపీలో కొనసాగుతున్న తనిఖీలు.. కృష్ణా జిల్లాలో 12 సినిమా థియేటర్లు సీజ్

Krishna

movie theaters seized in Krishna : ఏపీలో సినిమా థియేటర్లపై తనిఖీలు కొనసాగుతున్నాయి. పోలీసులతో కలిసి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో 12 థియేటర్లు సీజ్ చేశారు. మరో మూడు థియేటర్లను పరిశీలించారు. లైసెన్సులు రెన్యూవల్ చేయని థియేటర్లను సీజ్ చేస్తున్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ సరిగా లేని ఒక థియేటర్ కు జరిమానా విధించారు. అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తే సీజ్ చేస్తామని అధికారులు అంటున్నారు. ఫామ్ – బీ లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సైతం తనిఖీలు చేపట్టారు. పెద్ద హీరోల సినిమాలకు, పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే చర్యలు తప్పవని అధికారులు అంటున్నారు. థియేటర్లలో తిను బండరాలు, పార్కింగ్ విషయంలో దోపిడీపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రభుత్వ తీరుపై చర్చించుకొనేందుకు ఎగ్జిబీటర్లు త్వరలో సమావేశం కానున్నారు.

Hero Nani: ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గించడం ప్రేక్షకులను అవమానించడమే!

విజయనగరం జిల్లాలో నిన్న 6 సినిమా థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేదంటూ.. సినిమా థియేట‌ర్లపై జాయింట్ క‌లెక్టర్ డాక్టర్ కిశోర్ కుమార్ కొర‌డా ఝుళిపించారు. ఆరు సినిమా హాళ్లను మూసివేయాల‌ని తాహశీల్దార్‌ను ఆదేశించారు.

పూసపాటిరేగ‌, భోగాపురం, నెల్లిమర్ల మండ‌లాల్లో ఆక‌స్మికంగా ప‌ర్యటించి.. సినిమా థియేట‌ర్లను అధికారులు త‌నిఖీ చేశారు. పూస‌పాటిరేగ సాయికృష్ణా థియేట‌ర్‌ను ఆఫీసర్లు ప‌రిశీలించారు. ఈ థియేట‌ర్‌లో ఫైర్ సేఫ్టీ లైసెన్స్ 2015 నుంచి రెన్యువ‌ల్ చేయ‌క‌పోవ‌డాన్ని గుర్తించి.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. థియేట‌ర్‌ను సీజ్ చేయాల‌ని తాహశీల్దార్‌ను జేసీ ఆదేశించారు.

Radhe Shyam: ప్రభాస్‌తో గొడవ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పూజా వస్తుందా?
భోగాపురంలోని గోపాల‌కృష్ణ థియేట‌ర్‌ను త‌నిఖీ చేసి.. సినిమా టిక్కెట్లను అధిక ధ‌ర‌ల‌కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ థియేట‌ర్‌ను కూడా సీజ్ చేయాల‌ని జేసీ ఆదేశించారు. నెల్లిమర్లలోని ఎస్ త్రి సినిమాస్ థియేటర్‌లో కూడా.. టిక్కెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలడంతో.. హాలును అధికారులు సీజ్ చేశారు. విజయనగరం జిల్లాలోనే మొత్తం ఆరు థియేటర్లకు మూత వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.