Hero Nani: ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గించడం ప్రేక్షకులను అవమానించడమే!

గత కొన్ని రోజులుగా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా..

Hero Nani: ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గించడం ప్రేక్షకులను అవమానించడమే!

Hero Nani

Hero Nani: గత కొన్ని రోజులుగా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా మారింది పరిస్థితి. ఇప్పటికే పలుమార్లు టాలీవుడ్ పెద్దలు, కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని ప్రభుత్వ పెద్దలను కోరారు. ఏపీ టికెట్ రేట్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35పై కొందరు హైకోర్టుకు వెళ్లగా అక్కడ కొంత ఊరట లభించింది. అయినా ప్రభుత్వం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచిలో అప్పీల్ దాఖలు చేసింది.

Shyam Singha Roy: రెబల్‌గా మారిన కూల్ బాయ్ నానీ.. ఫలితం ఎలా ఉండబోతుందో?

ఈ సినిమా టికెట్ల వివాదంపై ఇప్పటి వరకు టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది స్పందించి వారి వారి వెర్షన్ వినిపించగా.. ఇప్పుడు నేచురల్ స్టార్ నానీ కూడా స్పందించాడు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని నానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటుందన్న నానీ.. టికెట్ ధరలు పెంచినా కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని.. ప్రభుత్వం కావాలని వారిని అవమానిస్తుందన్నాడు.

SS Rajamouli: వాయిదా వివాదం.. జక్కన్నని ట్రోల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్!

ఇప్పుడు ఏదీ మాట్లాడినా వివాదం అవుతుందని అంటూనే నానీ.. టూర్ కు తీసుకెళ్లే పిల్లల నుంచి ఉపాధ్యాయులు ఒక్కొక్కరి నుంచి 100 వసూలు చేస్తే ఒకరిని నువ్వు ఇవ్వలేవంటే అవమానించడమే కదా అని ప్రశ్నించారు. ఈ శుక్రవారం నానీ నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదల కానున్న సందర్భంగా గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా చిట్ చాట్ లో నానీ ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ఈ విధంగా స్పందించాడు.