Shyam Singha Roy: రెబల్‌గా మారిన కూల్ బాయ్ నానీ.. ఫలితం ఎలా ఉండబోతుందో?

ఈ శుక్రవారం శ్యామ్ సింఘరాయ్ గా సరికొత్తగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు నాని. ఇప్పటి వరకూ కూల్ డూడ్ క్యారెక్టర్లు చేసిన నాని.. ఇప్పుడు రెబల్ గా రెవల్యూషనరీ యాక్టింగ్ తో ఎంగేజ్..

Shyam Singha Roy: రెబల్‌గా మారిన కూల్ బాయ్ నానీ.. ఫలితం ఎలా ఉండబోతుందో?

Shyam Singha Roy

Shyam Singha Roy: ఈ శుక్రవారం శ్యామ్ సింఘరాయ్ గా సరికొత్తగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు నాని. ఇప్పటి వరకూ కూల్ డూడ్ క్యారెక్టర్లు చేసిన నాని.. ఇప్పుడు రెబల్ గా రెవల్యూషనరీ యాక్టింగ్ తో ఎంగేజ్ చెయ్యబోతున్నాడు. నాని సినిమాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా సౌత్ ఇండియా మొత్తం రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిలా స్వీట్ గా క్యూట్ గా కనిపించిన నాని.. కెరీర్ లో డిఫరెంట్ డైమెన్షన్ చూపించబోతున్నాడు. రొటీన్ సినిమాల రూట్ మార్చి కొత్త కథలు ట్రై చేస్తున్న నాని రాహుల్ సాంకృత్యన్ తో బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో శ్యామ్ సింఘరాయ్ మూవీని ఈశుక్రవారం రిలీజ్ చేస్తున్నారు.

Radhe Shyam: ఫ్యాన్స్‌కు పండగ రోజు.. నేడే రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్!

ముగ్గురు హీరోయిన్లు, నాని 2 క్యారెక్టర్స్ తో ఇంట్రస్టింగ్ గా ఉండబోతోంది శ్యామ్ సింఘరాయ్. కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా మీదే అన్ని ఆశలు పెట్టుకున్నాడు నాని. సినిమా ఎలా అయినా హిట్ అవ్వాలని అన్ని ఎలిమెంట్స్ తో ప్యాక్ చేశారు నాని. సాయిపల్లవి, మడోన్నా, కృతి శెట్టి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని రెండు వేరియేషన్స్ లో కనిపించబోతున్నారు. ఒకటి కంప్లీట్ గా ఇప్పటి ట్రెండ్ ని ఫాలో అయితే ఇంకొకటి.. కోల్ కతాలో దేవదాసి వ్యవస్త మీద పోరాడిన సీరియస్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. అక్కడి నేటివిటీ కోసం ఈ సినిమాని కోల్ కతాలో దాదాపు నెలరోజులపైనే షూట్ చేశారు టీమ్.

Dhanush SIR: ఇంట్రస్టింగ్ టైటిల్.. ధనుష్ తొలి తెలుగు సినిమా ‘సార్’!

ఇంటెన్స్ ఎమోషన్స్ తో తెరకెక్కిన శ్యామ్ సింఘరాయ్ లో ముగ్గురు హీరోయిన్లున్నారు. సాయిపల్లవి, కృతి శెట్టితో పాటు.. మడోన్నా సెబాస్టియన్ మరో ఇంట్రస్టింగ్ రోల్ ప్లే చేస్తోంది. ఈముగ్గురు టాలెంటెడ్ హీరోయిన్స్ తో నాని చేసిన శ్యామ్ సింఘరాయ్ ఫామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ నికూడా ఎట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే సినిమా మీద విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ తోపాటు నాని 65 అడుగుల పెద్ద కౌటౌట్ తో రిలీజ్ సందడి స్టార్ట్ చేసేశారు ఫాన్స్. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.