SS Rajamouli: వాయిదా వివాదం.. జక్కన్నని ట్రోల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్!

ట్రిపుల్ఆర్, రాధేశ్యామ్ సినిమాలకోసం సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నారు పవన్ కళ్యాణ్. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఇండస్ట్రీ బాగుకోసం ఎక్కడ తగ్గాలో తెలిసి రియల్ హీరో అనిపించుకున్నారని..

SS Rajamouli: వాయిదా వివాదం.. జక్కన్నని ట్రోల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్!

Ss Rajamouli

SS Rajamouli: ట్రిపుల్ఆర్, రాధేశ్యామ్ సినిమాలకోసం సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నారు పవన్ కళ్యాణ్. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఇండస్ట్రీ బాగుకోసం ఎక్కడ తగ్గాలో తెలిసి రియల్ హీరో అనిపించుకున్నారని ఫాన్స్ పవన్ కళ్యాణ్ ని పొగుడుతున్నారు. మరోవైపు ఈ సీన్ లో హీరో పవన్ కళ్యాణ్ అయితే.. క్రెడిట్ మొత్తం మహేష్ బాబుకి ఇస్తారా అంటూ రాజమౌళిని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్స్.

Radhe Shyam: ఫ్యాన్స్‌కు పండగ రోజు.. నేడే రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్!

జనవరి 12న రిలీజ్ అని ఫస్ట్ నుంచి చెబుతున్న భీమ్లానాయక్ సినిమాని సంక్రాంతి బరిలోకి దింపడానికి అన్ని రకాలుగా రెడీ అయ్యింది. అంతేకాదు.. ఒక వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు అదే రేంజ్ లో ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసింది. కానీ ఆరఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలకు ధియేటర్లతో పాటు మరికొన్ని ఇష్యూస్ వల్ల సినిమా పోస్ట్ పోన్ చేసుకోమని ట్రిపుల్ఆర్, రాధేశ్యామ్ టీమ్ అడిగితే.. ఫిబ్రవరికి భీమ్లానాయక్ పోస్ట్ పోన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్.

Dhanush SIR: ఇంట్రస్టింగ్ టైటిల్.. ధనుష్ తొలి తెలుగు సినిమా ‘సార్’!

ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సున్నా కన్విన్స్ అయ్యి సినిమా పోస్ట్ పోన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే.. రాజమౌళి సంక్రాంతి రేస్ నుంచి ఫస్ట్ తప్పుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ అని, అసలు సర్కారు వారి పాట సంక్రాంతికి యాప్ట్ సినిమా అయినా.. పెద్ద మనసుతో సినిమా ఏప్రిల్ కి పోస్ట్ పోన్ చేసుకున్నారని.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అసలు హెల్ప్ చేసింది పవన్ కళ్యాణ్ అయితే.. క్రెడిట్ మొత్తం మహేష్ బాబుకి ఇవ్వడం ఏంటని ఫైర్ అవుతున్నారు పవన్ ఫాన్స్.
Radhe Shyam: రూట్ మార్చేశారు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ హీరో హోస్టింగ్!
సినిమాల మధ్య హెల్తీ ఎట్ మాస్ఫియర్ ఉండాలన్న రాజమౌళే.. ఆ పరిస్తితి లేకుండా చేశారంటున్నారు ఫాన్స్. సర్కారు వారి పాట, భీమ్లానాయక్.. ట్రిపుల్ఆర్ కంటే ముందే సంక్రాంతి రేస్ లో వస్తున్నామని అనౌన్స్ చేశారు. కానీ మిడిల్ లో వచ్చి రాజమౌళే మొత్తం డిస్టర్బ్ చేశాడని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాని రిస్క్ లో పెట్టారని, ఇదేం హెల్తీ కాంపిటీషన్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.