CM Chandrababu : చనిపోతే ఒక్క క్షణం.. జైలులో సందేహంగా కొన్ని సంఘటనలు జరిగాయి.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

బాలకృష్ణ మొదటి రాత్రి జైలులో ఎలా గడిచింది అని అడిగారు. దానికి చంద్రబాబు సమాధానమిస్తూ..

CM Chanadrababu Sensational Comments on his Jail Days in Unstoppable Show

CM Chandrababu : ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 4 నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి ఎపిసోడ్ కి సీఎం చంద్రబాబు రాగా రాజకీయాలు, పవన్ కళ్యాణ్, ఫ్యామిలీ, జైలు జీవితం గురించి.. ఇలా చాలా అంశాలు మాట్లాడారు. సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరెస్ట్ అయి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలకృష్ణ మొదటి రాత్రి జైలులో ఎలా గడిచింది అని అడిగారు.

Also Read : Chandrababu Naidu : లోకేశ్‌ యువ‌గ‌ళం పాద‌యాత్ర పై అన్‌స్టాప‌బుల్‌లో చంద్ర‌బాబు కామెంట్స్‌

దానికి చంద్రబాబు సమాధానమిస్తూ.. నంద్యాల నుంచి అడవుల్లో అమరావతికి తీసుకొచ్చారు. రాత్రంతా ఇన్వెస్టిగేషన్ పేరుతో తిప్పి తెల్లారి మెడికల్ టెస్టులకు తిప్పారు. ఆ తర్వాత అక్కడా ఇక్కడా తిప్పి కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు ఆర్గ్యుమెంట్స్ చేసారు. అర్ధరాత్రి రాజమండ్రి జైలుకి పంపించారు. ఆ రాత్రి చేయని తప్పుకు అరెస్ట్ చేయడం, ఆ చేసిన విధానం చూసి గుండె తరుక్కుపోయింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు సందేహంగా కొన్ని సంఘటనలు జరిగాయి. అయినా నేను ధైర్యంగా ఉన్నాను, ఎదుర్కొన్నాను కాబట్టి ఏమి జరగలేదు. లేకపోతే ఏమయ్యేదో ఇంకోలా ఉండేది. చనిపోతే ఒక్క క్షణం. అనుకున్న ఆశయం కోసం పనిచేస్తే అది శాశ్వతం. అదే నన్ను ముందుకు నడిపించింది. చావు గురించి ఆలోచిస్తే జీవితంలో ఏది చేయలేము అని అన్నారు. దీంతో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.