Chandrababu Naidu : లోకేశ్‌ యువ‌గ‌ళం పాద‌యాత్ర పై అన్‌స్టాప‌బుల్‌లో చంద్ర‌బాబు కామెంట్స్‌

ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రారంభ‌మైంది.

Chandrababu Naidu : లోకేశ్‌ యువ‌గ‌ళం పాద‌యాత్ర పై అన్‌స్టాప‌బుల్‌లో చంద్ర‌బాబు కామెంట్స్‌

Chandrababu comments on lokesh yuvagalam padayatra in Balakrishna Aha Unstoppable Show

Updated On : October 25, 2024 / 9:19 PM IST

ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రారంభ‌మైంది. తొలి ఎపిసోడ్‌కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గెస్ట్ గా వ‌చ్చారు. ప్రస్తుతం అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో లోకేశ్‌ యువ‌గ‌ళం పాద‌యాత్ర గురించి మాట్లాడారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా 226 రోజులపాటు లోకేశ్‌ పాదయాత్ర సాగింది. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి 3,132 కిమీ లోకేశ్‌ పాద‌యాత్ర నిర్వ‌హించారు.

పాద‌యాత్ర మొద‌టి నుంచి ప్ర‌మాణ స్వీకారం దాకా విశ్ర‌మించ‌కుండా ప‌ని చేసిన నిజ‌మైన తెలుగు దేశం కార్య‌క‌ర్త నారా లోకేశ్‌ అని బాల‌కృష్ఱ అన్నారు. పాద‌యాత్ర ఎవ‌రి నిర్ణ‌యం అని బాల‌య్య ప్ర‌శ్నించారు. అది లోకేశ్‌ నిర్ణ‌యం అని చంద్ర‌బాబు తెలిపారు.

Chandrababu – Balakrishna : చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బాలకృష్ణ రియాక్షన్ ఇదే.. అన్‌స్టాపబుల్‌లో బాలకృష్ణ వ్యాఖ్యలు..

లోకేశ్‌ అనే వ్య‌క్తి నంద‌మూరి తార‌క‌రామారావు గారి మ‌న‌వ‌డిగానో, చంద్ర‌బాబు నాయుడు కొడుకుగానో, బాల‌య్య అల్లుడిగానో కాకుండా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేకత‌ కావాల‌ని, తాను నిరూపించుకుంటాన‌ని అని వెళ్లాడు. ప్ర‌జ‌ల కోసం పోరాడ‌తా అని చెప్పాడు. వెళ్లాడు నిరూపించుకున్నాడు అని చంద్ర‌బాబు చెప్పారు.

యువ‌గ‌ళం పాద‌యాత్రతో లోకేశ్‌ లో ఎంతో మార్పు వ‌చ్చింద‌న్నారు. లోకేష్ యువ‌గ‌ళం కంటే ముందు లోకేష్ యువ‌గ‌ళం త‌రువాత అని చెప్పారు. జీవితంలో ఓ ట‌ర్నింగ్ పాయింట్ కింద ప్ర‌జా హితం కోసం, ప్ర‌జా సేవ కోసం అంకితం అవుతాడ‌ని త‌న ఆలోచ‌న అది జ‌ర‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని చంద్ర‌బాబు అన్నారు.

Chandrababu Naidu : ఆ అరెస్టు రోజుని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నాను.. అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు ఎమోషనల్..