ఇంటికి రూ.25వేలు- సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

కిరాణ షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25వేల చొప్పుల ఇస్తామని చెప్పారు.

Flood Victims (Photo Credit : Google)

Flood Victims Financial Aid : వరద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. ఇంటికి రూ.25వేల చొప్పున ఇస్తామన్నారు. విజయవాలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25వేలు.. ఫస్ట్, ఇతర ఫ్లోర్లు మునిగిన వారికి 10వేలు చొప్పున సాయం చేస్తామన్నారు. కిరాణ షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25వేల చొప్పుల ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Also Read : పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ వైఖరి మారిందా? ఏం జరుగుతోందో తెలుసా?

179 సచివాలయాలలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వాళ్లకు ఒక్కో ఇంటికి రూ.25వేల ఆర్థికసాయం చేస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ లో, ఆపైన ఉండే ప్రతీ ఇంటికి రూ.10 వేలు ఇస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారులకు రూ.25వేలు. ఎంఎస్ఎంఈల్లో 40లక్షల లోపు టర్నోవర్ ఉంటే జీఎస్టీ ఫైల్ చేయాల్సిన పని లేదు. రూ.50 వేలు సాయం. రూ.40 లక్షల నుంచి 1.5 కోట్ల టర్నోవర్ వరకు లక్ష రూపాయల సాయం. అంతకు మించి టర్నోవర్ ఉన్న వారికి 1.5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం. 4,500 త్రీ వీలర్స్ కు రూ.10 వేలు. అవసరమైన వారందరికీ తోపుడు బండ్లు ఉచితంగా ఇస్తాం. 6,749 ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ 6.75 కోట్లు ఇవ్వాల్సి ఉంది.

ప్రభుత్వం ఆర్థికసాయం వివరాలు..
దెబ్బతిన్న టూ వీలర్లకు రూ.3వేలు
త్రీ వీలర్స్-రూ.10వేలు
కిరాణ షాప్స్ కు రూ.25వేలు
ఫిషింగ్ బోట్లు పాక్షికంగా దెబ్బతింటే రూ.9వేలు
పూర్తిగా దెబ్బతింటే రూ.20వేలు ఆర్థిక సాయం
తోపుడు బండ్లు దెబ్బతింటే కొత్త బండ్లు
వీవర్స్ కు రూ.15వేలు. మొత్తం మగ్గం పోతే రూ.25వేలు
సెరికల్చర్ కు హెక్టార్ కు 25వేలు

పశువులకు..
గేదెలు మరణిస్తే – రూ. 50వేలు
ఎద్దులు మరణిస్తే – 40వేలు
గొర్రెలు మరణిస్తే – 7వేల 500

వ్యవసాయ పంటలకు..
వరి ఎకరాకు 10వేలు, హెక్టార్ కు 25 వేలు
మిరప హెక్టార్ కు – రూ.35వేలు

వ్యాపారస్తులకు రుణాల రీ షెడ్యూల్. ఒక సంవత్సరం మారిటోరియం ఇవ్వమని బ్యాంకులకు చెప్పాం
4వేల మందికి ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ లాంటి సర్వీస్ అందించాం
ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి 3500 ఫిర్యాదులు వస్తే 1500 పూర్తయ్యాయి
బుడమేరు వరద బాధిత ప్రాంతాల్లో మున్సిపల్, ప్రాపర్టీ టాక్స్ చెల్లింపునకు 3 నెలల గడువు.

”బుడమేరుకు ఊహించని వరద వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం అసంపూర్తిగా పనులు వదిలేయడమే ఈ దుస్థితికి కారణం. 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే సమయంలో 40 మెట్రిక్ టన్నుల బరువున్న 3 బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్ కౌంటర్ వెయిట్ ను ఢీకొట్టాయి. బోట్లను తీసేందుకు ఇప్పటికీ తీవ్రంగా కష్టపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వమే ఉండి ఉంటే.. వరదల నుంచి 6 నెలలైనా కోలుకునే వాళ్లం కాదు” అని సీఎం చంద్రబాబు అన్నారు.