తెలుగుదేశం స్వింగ్‌లో ఉంది.. కేసిఆర్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలి

  • Publish Date - March 24, 2019 / 05:59 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఫుల్ స్వింగ్‌లో ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక ఆట ఆడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌‌లో మాట్లాడిన చంద్రబాబు.. ప్రతి కార్యకర్త ఎన్నికల పోరాటానికి కమాండర్‌గా తయారు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర హక్కుల కోసం చేసే ప్రజా పోరాటంలో కేసిఆర్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు.

జగన్ ద్వారా ఆంధ్రాను దోచుకునేందుకు కేసీఆర్‌ సిద్ధపడ్డాడని చంద్రబాబు ఆరోపించారు. కాపు రిజర్వేషన్లు తన పరిధిలో లేదన్న జగన్.. కాపులకు న్యాయం చేస్తానంటూ నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు. నేరస్థుడిని నేరస్థుడిలా చూస్తాం.. కానీ నేరస్థుడైన జగన్.. రాజకీయ నేతలా చలామణి అవుతున్నారని అన్నారు. అరాచకాలనే సృష్టించే ప్రయత్నాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు.