Cm Chandrababu Naidu : ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం అంశంపై మరోసారి సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే వరకూ గట్టిగా పోరాడతామని ఆయన తెలిపారు. ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వటం దేశాన్ని గౌరవించుకోవటం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతీ కుటుంబం ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
పేదవాడు పేదవాడిగా మిగలకుండా ఆర్ధిక అసమానతలు తొలిగే విధానాలకు శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు తెలిపారు. దేశం గర్వించే జాతిగా తెలుగు వారు ఎదగటమే ఎన్టీఆర్ కు ఇచ్చే నిజమైన నివాళి అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుజాతిని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబెట్టే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
Also Read : ఆ 10 రోజులు తిరుమలలో అన్ని రకాల దర్శనాలు రద్దు- టీటీడీ కీలక నిర్ణయం
పెనమలూరులో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ సినీ నట ప్రస్థానంపై పుస్తకం ఆవిష్కరించారు.
‘ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పని చేస్తున్నాం. ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047ని లాంచ్ చేశాం. ఎన్టీఆర్ ను ఒకసారి తలచుకుని, ఆయన ఫోటోను చూసి సంకల్పం చేస్తే ఏదైనా సాధ్యం అనేది నా అభిప్రాయం. ఆయన స్ఫూర్తి మనలో ఉంది. ఆయన ఆశీస్సులు మనపై ఉన్నాయి. మూడు సిద్ధాంతాలు, 10 ప్రిన్సిపల్స్ తో విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. అందులో ఒకసారి చూస్తే వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీలో ఉండాలనేది నా సంకల్పంగా ఒక విజన్ డాక్యుమెంటరీ తీసుకొచ్చాం. అందులో 10 ప్రిన్సిపల్స్ ను చూస్తే.. జీరో పావర్టీ. అది ఎన్టీఆర్ కల. అది సాధిస్తాం. పేదరికం లేని సమాజం మనందరి ధ్యేయం కావాలి. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి ఒక అర్థం ఉంటుంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read : జమిలిపై వైసీపీ ఆశలు.. ఎన్నికలకు రెడీ కావాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు