Cm Chandrababu Representative Image (Image Credit To Original Source)
Cm Chandrababu: ఏపీలో కరెంటు చార్జీల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఐదేళ్ల పాటు కరెంటు చార్జీల పెంపు అన్నది ఉండదని చంద్రబాబు ప్రకటించారు. అందుకు నాదీ గ్యారెంటీ అని అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. బహిరంగ సభలో మాట్లాడారు.
”చెడుని గుర్తు పెట్టుకోండి. మంచిని ప్రోత్సహించండి. ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తే ప్రజల జీవితాల్లో పెను మార్పులు వస్తాయి. ఐదేళ్లలో 32వేల కోట్ల రూపాయల కరెంటు చార్జీలు పెంచారు. ఆ వ్యవస్థలో లక్ష 20వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు. అవినీతి జరిగింది. అసమర్ధత పెరిగింది. భారం ప్రజల మీద పడింది. నేను వచ్చాక సమర్ధవంతంగా పని చేపించాను.
పోయిన ప్రభుత్వంలో ప్రజలపై వేసిన 4వేల 600 కోట్ల రూపాయల ఎక్సైజ్ డ్యూటీని వేస్తే దాన్ని అమలు చేయకుండా రద్దు చేసిన గవర్నమెంట్ ఎన్డీయే గవర్నమెంట్. ఎన్నికల ముందు చెప్పాను. కరెంటు చార్జీలు పెంచను అని చెప్పా. విద్యుత్ చార్జీలు పెంచకుండా ఐదేళ్లు మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నాది అని మీకు మరోసారి హామీ ఇస్తున్నారు. ఇదెలా సాధ్యమైందంటే.. సమర్థత పెంచాం, అవినీతిని కట్టడి చేశాం” అని చంద్రబాబు అన్నారు.
‘ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, సరఫరాకి ప్రభుత్వానికి 5 రూపాయల 19 పైసలు అవుతుంది. పేదలకు కరెంట్ ఉచితంగా ఇవ్వాలి. గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి. వ్యవసాయానికి ఫ్రీగా ఇవ్వాలి. అన్నీ ఇచ్చిన తర్వాత కొంతమందికి 9 రూపాయలకి కరెంట్ వేసే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో కరెంటు కొనుగోలు ఖర్చు తగ్గించే బాధ్యత నేను తీసుకుంటా అని హామీ ఇస్తున్నారు. సోలార్ కి ప్రాధాన్యత ఇచ్చాం. గాలితో, నీటితో కరెంట్ తయారు చేస్తున్నాం. ఇప్పటికే పేరుకుపోయిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పూర్తిగా క్లీన్ చేశాం. అన్ని రంగాల్లో ప్రక్షాళన చేశాం” అని చంద్రబాబు అన్నారు.
Also Read: ఏలూరు టీడీపీలో వైసీపీ కోవర్టులెవరు? చింతమనేని టార్గెట్ చేసింది ఎవరిని?