CM Chandrababu lay foundation stone for New House in Amaravati
CM Chandrababu New House: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం ఉదయం భూమిపూజ చేశారు. కుటుంబ సభ్యులు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మిణి, దేవాంశ్ తదితరులు పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ఈ9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు.
ప్రజారాజధాని అమరావతిలో సొంతింటి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు కాన్వాయ్ వస్తుండగా.. జై చంద్రబాబు, జై అమరావతి అంటూ స్థానిక రైతులు పెద్దెత్తున నినాదాలు చేశారు. క్వానాయ్ ఆపి రైతులందరినీ చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా వారికి రైతులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి గ్రామస్తులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
Also Read: Aadhaar: సరికొత్త ఆధార్ యాప్ వచ్చేసింది.. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే..? ఇక ఆధార్ కార్డుతో పనిలేదు..
అమరావతిలో ఇంటి నిర్మాణం ప్లాన్ ను కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేశ్ వివరించారు. భూమి పూజ కార్యక్రమం పూర్తి చేసుకొని సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఉండవల్లి వెళ్లారు. ఇదిలాఉంటే.. వెలగపూడి సచివాలయం వెనుక ఈ9 రహదారి పక్కనే చంద్రబాబు నాయుడు తన ఇంటి నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. రైతుల నుంచి ఐదు ఎకరాల భూమిని చంద్రబాబు కుటుంబం కొనుగోలు చేసింది. జీ ప్లస్ 1 మోడల్ లో సొంతింటి నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఏడాదిలోపే నిర్మాణం పూర్తిచేసి గృహప్రవేశం చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు.