CM Chandrababu Naidu inspects Polavaram project
CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్‌ఎఫ్ (ECRF) గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతోపాటు డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో జరుగుతున్న తాజా పరిణామాలపై సమీక్షించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఇంజనీర్లను, కాంట్రాక్ట్ ఏజెన్సీలకు సీఎం చంద్రబాబు సూచించారు. నిర్వాసితుల పునరావాస ప్యాకేజీల (ఆర్ అండ్ ఆర్) అమలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని చంద్రబాబు సూచించారు.