×
Ad

Indrakeeladri: అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు.. వీడియో

రాష్ట్ర ప్రభుత్వం తరఫున పసుపు, కుంకుమ, గాజులు, పండ్లను సమర్పించారు.

Chandrababu Naidu Indrakeeladri visit

Indrakeeladri: విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లను సమర్పించారు. సోమవారం అమ్మవారు సరస్వతి అలంకరణలో దర్శనం ఇస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రి వరకు సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇస్తారు.

Also Read: సెల్ఫీ విత్‌ సద్దుల బతుకమ్మ.. 10టీవీకి వాట్సాప్‌ చేయండి.. స్పెషల్‌ గిఫ్ట్‌ను సొంతం చేసుకోండి..

చంద్రబాబు నాయుడి రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రిలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ వీఐపీ, వీవీఐపీ దర్శనాలను రద్దు చేశారు. అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనాలు మాత్రమే కొనసాగుతున్నాయి.

ప్రజలందర్నీ ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. రిజర్వాయర్లకు నీళ్లు రావడంతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని తెలిపారు. ఏపీలోని రిజర్వాయర్లు 94 శాతం నిండాయని అన్నారు.

అమ్మవారి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు చేసుకుంటున్నారని తెలిపారు. సామాన్య భక్తుల దర్శనం కోసం సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తున్నామని చెప్పారు. 6 నెలల్లో అన్న ప్రసాద భవన నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు.