డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్ ఛేంజర్ కానుంది.. డ్రోన్ సమ్మిట్-2024లో సీఎం చంద్రబాబు

మంగళగిరిలో అమరావతి డ్రోన్ సమ్మిట్-2024ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..

డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్ ఛేంజర్ కానుంది.. డ్రోన్ సమ్మిట్-2024లో సీఎం చంద్రబాబు

CM Chandrababu

Updated On : October 22, 2024 / 12:53 PM IST

CM Chandrababy naidu: డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్ ఛేంజర్ కానుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పౌరవిమానయాన శాఖ, డీఎఫ్ఐ, సీఐఐ భాగస్వామ్యంతో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో రెండ్రోజులపాటు అమరావతి డ్రోన్ సమ్మిట్ -2024 సదస్సు జరుగుతుంది. ఈ సమ్మిట్ ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సమ్మిట్ లో 6,929 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. యువత సాంకేతిక నిపుణులతో సదస్సు నిండిపోయిందన్నారు. 1995లో తొలిసారి సీఎం అయ్యాక ఐటీపై దృష్టిసారించా. హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. ఆ రోజుల్లో అమెరికా వెళ్లి పదిహేను రోజులు అనేక సంస్థలను కలిశా. ఆ రోజుల్లోనే పీపీపీ పద్దతిలో హైటెక్ సిటీని నిర్మించాం. ఐటీ, నాలెడ్జ్ ఎకనామీలో భారతీయులు చాలా సమర్ధులని సీఎం చంద్రబాబు అన్నారు.

 

ఏపీని డ్రోన్ హబ్ గా మార్చడమే లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడ వరదల సమయంలో డ్రోన్లు వినియోగించాం. డ్రోన్ సేవలు అద్భుతం. డ్రోన్లతో ఆహారం, మందులు పంపించాం. రెస్క్యూ టీమ్స్ వెళ్లలేని చోటుకు డ్రోన్స్ ద్వారా ఆహారం పంపించాం. డ్రోన్లను వ్యవసాయం సహా అనేక రంగాల్లో వినియోగించవచ్చు. కొత్త ఆలోచనలు వస్తే ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చునని చంద్రబాబు అన్నారు. డ్రోన్ నిబంధనలను కేంద్రం సులభతరం చేసిందని,
డ్రోన్ ఫ్యూచర్ గేమ్ ఛేంజర్ కాబోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. డ్రోన్ల వినియోగంతో రౌడీషీటర్ల కదలికలపై నిఘాతోపటు శాంతిభద్రతల పరిరక్షణకు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు డ్రోన్ లను వినియోగించొచ్చునని, పోలీసు శాఖలో డ్రోన్ల విస్తృత వినియోగానికి కృషి చేస్తామని చంద్రబాబు చెప్పారు.