Cm Chandrababu : రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. పోలవరం ప్రాజెక్ట్ సందర్శన

ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

CM Chandrababu Naidu

Cm Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు చంద్రబాబు. త్వరలో నిర్మించనున్న పోలవరం ప్రాజెక్ట్ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ సిబ్బంది సూచనలు చేశారు. హెలిప్యాడ్ నుంచి సీఎం చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు.

సోమవారం ఉదయం 10 గంటల 45 నిమిషాల చంద్రబాబు పోలవరం చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు స్పిల్ వే, కాఫర్ డ్యామ్ తో పాటు అన్ని పనుల క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు చంద్రబాబు. ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ వర్క్ షెడ్యూల్ ప్రకటించనున్నారు చంద్రబాబు.

కొత్త డయాఫ్రం వాల్ కు సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. కొత్త డయాఫ్రమ్ వాల్ ప్రారంభ పనులు ఎప్పుడు చేపట్టాలి అనేది రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలన అనంతరం అధికార యంత్రాంగం కూడా ఒక నిర్ణయానికి రానుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం.. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా మంజూరు చేసిన నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో ఈ పనులు ప్రారంభయ్యే అవకాశం ఉంది.

Also Read : జమిలిపై వైసీపీ ఆశలు.. ఎన్నికలకు రెడీ కావాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు