Cm Chandrababu: పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. ప్రాజెక్టు పనులు పరిశీలన

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులు, ఇంజనీర్లతో..

cm chandrababu

CM Chandrababu Polavaram Tour : పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా.. సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులు, ఇంజనీర్లతో ఆయన సమీక్షించారు. ప్రాజెక్టు పనులు, నిర్వాసితుల పునరావాసంపై చర్చించనున్నారు. ఇదిలాఉంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు.

Also Read: ‘PV Sindhu – Pawan Kalyan : పెళ్లి పిలుపు.. డిప్యూటీ సీఎంని కలిసిన పీవీ సింధు..

2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ప్రతీ సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లు, అధికారుల నుంచి సమాచారం తెలుసుకునే వారు. ఇటీవల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఈ ఏడాది జూన్ 17న పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. మరోసారి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన చంద్రబాబు.. నిర్మాణ పనులపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్షలు జరిపి, పలు సూచనలు చేయనున్నారు.

 

చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శన ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ చూడండి..