Tirumala Stampede Victims : స్విమ్స్ ఆసుపత్రికి సీఎం చంద్రబాబు, తొక్కిసలాట బాధితులకు పరామర్శ..

తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tirumala Stampede Victims : సీఎం చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. తొక్కిసలాట బాధితులను ఆయన పరామర్శించారు. వారితో నేరుగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఘటన గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారాయన.

అంతకు ముందు అధికారులపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. ప్రజలు, మీడియా ముందే అధికారులపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనక బాధ్యత ఎవరిది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది.

Also Read : తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరం.. ప్రభుత్వ వైఫల్యమే కారణం : అంబటి రాంబాబు

తొక్కిసలాటకు కారణం ఏంటి? స్వయంగా బాధితులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు..
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఆయన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని తిరుపతి వెళ్లిపోయారు. స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు.. అక్కడ బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులతో స్వయంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. తొక్కిసలాటకు కారణాలు ఏంటి అని వారిని అడిగి తెలుసుకున్నారు.

అసలు అక్కడేం జరిగింది? అన్నది ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న బాధితులనే ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అలాగే వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై వారు సంతృప్తిగా ఉన్నారా? లేదా? అని స్వయంగా బాధితులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఘటన జరిగిన తర్వాత ఎంత సేపటికి అంబులెన్స్ వచ్చింది?
ఘటన జరిగిన తర్వాత ఎంత సేపటికి అంబులెన్స్ వచ్చింది? ఎంత సేపటికి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు? అసలు తప్పు ఎక్కడ జరిగింది? బాధితులనే డైరెక్ట్ గా అడిగి ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అదే సమయంలో అధికారుల తీరుపైనా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట ఘటన జరగడాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని ముందే తెలిసినా.. అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చెయ్యలేకపోయారని, దీనికి కారణం ఎవరు? బాధ్యులు ఎవరు? అని అధికారులపై నిప్పులు చెరిగారు చంద్రబాబు.

 

Also Read : తిరుపతి ఘటనపై స్పందించిన మాజీ మంత్రి రోజా.. వారిద్దరి వల్లే ఈ పరిస్థితి అంటూ ఆగ్రహం