మూడు రాజధానులే ముద్దు..సీఎం జగన్ ఫైనల్ నిర్ణయం

  • Publish Date - January 18, 2020 / 07:41 AM IST

రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం వెల్లడించినట్లుగానే ముందుకు సాగుతోంది. మూడు రాజధానులే ముద్దు అంటోంది సీఎం జగన్ సర్కార్. రెండు కమిటీల నివేదికలు, హైపవర్ కమిటీ అధ్యయనం తర్వాత సీఎం జగన్ ఫైనల్‌గా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2020, జనవరి 20వ తేదీన కేబినెట్ మీటింగ్ అనంతరం అసెంబ్లీలో దీనిపై చర్చకు పెట్టనుంది. సాంకేతిక అంశాలపై నిపుణుల సలహాలు తీసుకొంటోంది. ఇక పాలన రాజధానిని విశాఖకు తరలించడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2020, జనవరి 26 తర్వాత ఈ కార్యక్రమాలు స్పీడ్ అందుకోనున్నాయి. 

శాసనసభలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ..మండలిలో కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ వైసీపీకి సరియైన బలం లేదు. మండలిలో ఎలా వ్యవహరించాలనే దానిపై వైసీపీ కసరత్తు జరుపుతోంది. 

GN RAO, బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదికలను హై పవర్ కమిటీ సభ్యులు క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. అనంతరం ప్రభుత్వంలో పలుమార్లు చర్చలు జరిపింది. 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం భేటీ జరిగింది. పలు కీలక సూచనలు చేశారు సభ్యులు. దీంతో తొందరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. సీఆర్డీఏ కీలక బిల్లు, ఇతర టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. 

మూడు రాజధానులు వద్దూ..అంటూ అమరావతిలోని 29 గ్రామాల వాసులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా టీడీపీ నేతలు ఎక్కడికకక్డ ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీయాలని టీడీపీ లీడర్స్ డిసైడ్ అయ్యారు. ప్రతిపక్షం చేసే ఆరోపణలను తిప్పకొట్టేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. 

Read More : హే సాయి : సాయిబాబ జన్మస్థలం ఎక్కడ షిర్డీ ? పాథ్రీ ?