Mayor And Chairman Candidates
mayor and chairman candidates finalized : వైసీపీ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల ఎంపిక ఓ కొలిక్కి వచ్చింది. అభ్యర్థుల ఎంపిక పూర్తైంది. సామాజిక సమీకరణాలు, అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత పార్టీ అధినేత జగన్ అభ్యర్థులను ఖరారు చేశారు. సీల్డ్‌కవర్‌లో అభ్యర్థుల పేర్లను పార్టీ రీజనల్ ఇన్‌ఛార్జ్‌లకు పంపారు. సాయంత్రంలోగా వీటిని ప్రకటించే అవకాశం ఉంది.
మరోవైపు విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ అధిష్టానం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌కు మొండిచెయి చూపినట్లు తెలుస్తోంది. విశాఖ మేయర్ పదవిని మహిళకు కట్టబెట్టే యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. విశాఖ మేయర్ పీఠాన్ని ఏ మహిళకు కట్టబెట్టాలన్న దానిపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.