CM Jagan : 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చరిత్ర చంద్రబాబుది, శవ రాజకీయాలు చేస్తున్నాడు : సీఎం జగన్

చంద్రబాబు రాసిన మనసులో మాట చదవండని, రాష్ట్రంలోని ఉద్యోగాలు 40. 62 శాతం అదనంగా ఉన్నాయని చంద్రబాబు రాశారని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో శాశ్వత ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శించారు.

CM Jagan (3)

CM Jagan – Chandrababu – Pawan Kalyan : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు, అతని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కు తనపై కడుపు మంట అన్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలపై ప్రేమ లేదని విమర్శించారు. సోమవారం ఏపీఎన్జీవో రాష్ట్ర మహాసభలకు హాజరైన సీఎం జగన్ మాట్లాడారు. చంద్రబాబు పాలనలో 34 వేల ఉద్యోగాలు ఇచ్చాడు కానీ, 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి, అమ్మేసిన చరిత్ర చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. ఎవరి ప్రలోభాలకు గురి కావద్దన్నారు. పోలీసులు ఏం పాపం చేశారని అంగళ్లలో దాడి చేశారని నిలదీశారు.

47 మంది పోలీసులపై దాడి చేయించి చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ లు లేవని, ప్రభుత్వ ఆస్పత్రులు నిర్వీర్యం అవుతున్నాయని, ఆర్టీసీ సరిగా నడవడం లేదని చంద్రబాబు లాంటి పాలకుడు మూసివేస్తాడని ఆరోపించారు. చంద్రబాబు రాసిన మనసులో మాట చదవండని, రాష్ట్రంలోని ఉద్యోగాలు 40. 62 శాతం అదనంగా ఉన్నాయని చంద్రబాబు రాశారని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో శాశ్వత ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతిపై మవసులో మాట పుస్తకంలో రాశారని పేర్కొన్నారు.

Yarlagadda Venkat Rao : గ‌న్న‌వ‌రం, గుడివాడ ఏదైనా సై.. చంద్రబాబు డెసీషనే ఫైనల్

వీరంతా లంచకోరులనే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎక్కడో ఒక చొట ఏసీబీ కేసుల్లో దొరికితే ఏకంగా పుస్తకంలో రాసిన చంద్రబాబు మీకు మేలు చేయగలడా? అని ప్రశ్నించారు. పాలసీ నిర్ణయాలు చీసుకునేది సీఎం అయితే అమలు చేసేది మాత్రం ఉద్యోగులని పేర్కొన్నారు. పాలసీ నిర్ణయాలు సీఎం తీసుకుంటే అమలు చేసే బాధ్యత మాత్రం ఉద్యోగుల భుజస్కందాలపై ఉంటుందన్నారు. ఉద్యోగుల భవిష్యతు తమ బాధ్యతని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వంతో పోల్చినా తమ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉందని తెలిపారు.

1 లక్ష 35 వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. కమిట్ మెంట్ తప్పు లేకుండా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని తెలిపారు. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు గత ప్రభుత్వం ఎన్నికలకు ఆరు నెలల ముందు జీతాలు పెంచింది కానీ, తమ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి పెంచిన జీతాలు ఇస్తున్నామని తెలిపారు. 3,300 కోట్లకు జీతాలు ఎగబాకినా చిరు నవ్వుతో జీతాలు ఇస్తున్నామని చెప్పారు.

Errabelli Dayakar Rao : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం మంత్రి ఎర్రబెల్లి సంతకం ఫోర్టరీ.. ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు

55 వేల మంది ఆర్టీసి కార్మికులను రెగ్యులర్ చేశామని వెల్లడించారు. భాషా పండితులకు ప్రమోషన్, ఎంపీడివోలకు ప్రమోషన్ లు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థపై ప్రేమ, మమకారం ఉంది కాబట్టే ప్రభుత్వ వ్యవస్థలను విస్తరించామని తెలిపారు. గత ప్రభుత్వం గాలికి వదలేసిన సీపీఎస్ ను సంవత్సరంన్నర అధ్యయంన చేశామని తెలిపారు. విదేశాల్లో పెన్షన్ విధానాన్ని కూడా ఆద్యాయనం చేశామన్నారు.

ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గ్యారెంటీ స్కీం తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వంపై భారం పడకుండా ఉద్యోగులు రిటైర్డ్ ఆయ్యాక ఇబ్బందులు పడకుండా మంచి సెల్యూషన్ ఇవ్వగలిగామని వెల్లడించారు. దేశంలో ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టే మంచి స్కీం ఇది అని తెలిపారు. దేశానికే ఆదర్శం అయ్యే స్కీం ఇది అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రేపో, ఎల్లుండో ఆర్డినెన్స్ వస్తుందన్నారు. గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికీ చేడా చూడాలని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు