CM Jagan : వివిధ పథకాల లబ్ధిదారులకు రూ.216.34 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం జగన్

లంచం, వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఏ ఒక్కరూ మిస్ కాకూడదన్న తపన, తాపత్రయంతో మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు.

CM Jagan Funds Release

CM Jagan Funds Release : ఏపీలో వివిధ పథకాల లబ్ధిదారులకు నిధులు విడుదల అయ్యాయి. ఈ మేరకు గురువారం సీఎం జగన్ పలు పథకాల లబ్ధిదారులకు నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 2,69,169 మంది లబ్ధిదారులకు రూ.216.34 కోట్ల నిధులను విడుదల చేశారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ లంచం, వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఏ ఒక్కరూ మిస్ కాకూడదన్న తపన, తాపత్రయంతో మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు. లబ్ధిదారులకు మంచి జరగాలని, ప్రభుత్వం ఇంకా ప్రజలకు మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Payyavula Keshav : మీరు చెప్పిన లెక్క ప్రకారం పులివెందులలో జగన్ కు ఓటు ఉండటం నేరం : ఎమ్మెల్యే పయ్యావుల

15వేల నాలుగు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి ఇంటికి కూడా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక నాయకులు వెళ్లి జల్లెడ పట్టి ఏ ఒక్కరూ మిగిలి పోకూడదని జగనన్న సురక్ష కార్యక్రమాన్ని బాధ్యత తీసుకున్నారని పేర్కొన్నారు.

జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా 94 లక్షల 62 వేల 184 రకరకాల సర్టిఫికేట్లు ఇచ్చారని తెలిపారు. అర్హులుగా ఉన్న 12 వేల 405 మందిని గుర్తించి దరఖాస్తు చేయించి వారికి జగనన్న సురక్ష పథకాన్ని వర్తింప చేశామని తెలిపారు.