APSRTC
APSRTC New Buses : ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు పడ్డాయి. కొత్తగా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 2,736 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. రూ.572 కోట్ల అంచనాతో 1500 డీజిల్ బస్సులు కొంటున్నామని తెలిపారు.
జీసీసీ మూడ్ లో 1000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. అంతేకాకుండా 200 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని వెల్లడించారు. 36 కొత్త అద్దె బస్సులను తీసుకోబోతున్నామన్నారు. కేవలం 221 బస్సులే ఉన్నాయని చెప్పారు.
APSRTC Reduce Fares : ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీలు తగ్గింపు
అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపే విషయంపై ఒడిషా, కర్ణాటకతో ఒప్పందాలు పూర్తయ్యాయని ద్వారకా తిరుమలరావు తెలిపారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో త్వరలోనే ఒప్పందాలు చేసుకుంటామన్నారు.