Cm Jagan
CM Jagan Industrial Hub : కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్.. కొప్పర్తిలో ఇండస్ట్రియల్ హబ్ ను ప్రారంభించారు. కొప్పర్తిలో మెగా పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇండస్ట్రీయల్ హబ్ నిర్మాణం కోసం రూ.1585 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ఈ హబ్‌లో ప్రస్తుతం 6 కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. ఇప్పటికే రూ. 100 కోట్లు ఖర్చుచేశామన్నారు. కంపెనీల ద్వారా 6 నెలల్లో 7,500 ఉద్యోగాలు రానున్నాయని సీఎం జగన్ తెలిపారు. ఎలక్ట్రానిక్ హబ్‌తో దాదాపు 75 వేల మంది యువతకు.. ఉద్యోగాలు లభిస్తాయని సీఎం జగన్ చెప్పారు. ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు ఇదే చోట పని చేస్తారని చెప్పారు. ఈ మెగా పారిశ్రామిక హబ్‌లతో రాబోయే రోజుల్లో రాయలసీమ రూపురేఖలు మారిపోతాయని సీఎం జగన్ అన్నారు.
Best Smart Phones in India 2021 : డిసెంబర్ 2021లో రూ.25వేల లోపు బెస్ట్ మొబైల్ ఫోన్లు ఇవే..!
”ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ)లో 28 సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్లస్టర్ ద్వారా 75వేల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నాం. ఇప్పటికే డిక్సన్ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. డిక్సన్ సంస్థ ద్వారా దాదాపు 1800 మందికి ఉద్యోగాలు కల్పించాం. మరో ఆరు సంస్థలు త్వరలోనే తమ కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి. చదువుకున్న మన పిల్లలందరికీ మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పిస్తాం. భవిష్యత్తులో రాయలసీమ మరింత అభివృద్ధి చెందుతుంది” అని జగన్ అన్నారు.
January 1 Alert : జనవరి 1 నుంచి RBI కొత్త రూల్స్.. ఆన్‌లైన్ పేమెంట్లపై ఈ నిబంధనలు తప్పనిసరి..
కొప్పర్తి సెజ్‌లో ఇండస్ట్రియల్ పార్క్‌లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. 6వేల 914 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, 3వేల 164 ఎకరాల్లో వైఎస్‌ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ పార్క్, 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, 104 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు అభివృద్ధి చేసింది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌లో కంపెనీలు రూ. 1052 కోట్లు పెట్టుబడులను పెట్టనున్నాయి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌తో దాదాపు 14వేల 100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్కులను, వైఎస్ఆర్ జగనన్న ఇండస్ట్రీయల్ హబ్ లను, వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. మరో 18 చిన్న పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. అంతకుముందు బద్వేల్ లో సెంచురీ ప్లై పరిశ్రమకు జగన్ శంకుస్థాపన చేశారు. రూ.6 కోట్లతో కొత్త ఆర్డీవో ఆఫీసు నిర్మిస్తామన్నారు.