యుద్ధానికి సిద్ధం కండి- వాలంటీర్లకు సీఎం జగన్ పిలుపు

జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క. మన వాలంటీర్ వ్యవస్థ తులసి మొక్క. గత ప్రభుత్వం లంచాలు అలవాటు చేసింది.

CM Jagan With Volunteers

CM Jagan : గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గ్రామంలో వాలంటీర్ల వందనం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. రాబోయే రెండేళ్లలో పేదవాడికి సేవ చేసేందుకు సిద్ధమా అని జగన్ పిలుపునిచ్చారు. మన సైన్యం వాలంటీర్ల సైన్యం.. 2019 తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పని చేసిందన్నారు జగన్. టీడీపీది జన్మభూమి వ్యవస్థ, మనది పేదల వాలంటీర్ల సంస్థ అని జగన్ అన్నారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి పని నేరుగా వారి గ్రామంలోనే చేసిపెట్టామన్నారు జగన్.

”గత ప్రభుత్వం లంచాలు అడిగేది. మీ బిడ్డ ప్రభుత్వంలో 66లక్షల మందికి నేరుగా మీ గడపలోనే ఇచ్చాం. గత పాలనలో 39లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమంలో కేవలం గౌరవ వేతనంతో పని చేసేందుకు వచ్చిన వాలంటీర్లకు అభినందనలు తెలియచేస్తున్నా. గత ప్రభుత్వం దోచుకోవడానికి మాత్రమే పని చేసింది. జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క. మన వాలంటీర్ వ్యవస్థ తులసి మొక్క. గత ప్రభుత్వం లంచాలు అలవాటు చేసింది. కానీ ఈ నాలుగేళ్లు లంచం లేని వ్యవస్థను సృష్టించుకున్న ప్రభుత్వం మనది.

Also Read : 4 దశాబ్దాల చరిత్రలో తొలిసారి.. రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ నిష్క్రమణ..

390 కోట్లు వాలంటీర్ వ్యవస్థకు ఖర్చు పెడుతున్నాం. లంచాలు, వివక్ష లేకుండా 2లక్షల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి వెళ్లాయి. కోవిడ్ లాంటి సంక్షోభాన్ని కూడా ఎదుర్కోగలిగాం. చంద్రబాబు ఏం చేస్తున్నాడో ప్రజలు ఒకసారి చూడండి. ప్రజల కష్టాల నుండి పుట్టిన మేనిఫెస్టో.. మనది. హైదరాబాద్ నుండి పుట్టిన మేనిఫెస్టో టీడీపీది. అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు దిట్ట. మీ బిడ్డ చేస్తున్న కార్యక్రమాలు వెలకట్టలేనివి. వృద్ధులకు 3వేల రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నాం. యుద్ధానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చింది” అని వాలంటీర్లకు పిలుపునిచ్చారు సీఎం జగన్.

Also Read : ఏపీని షేక్ చేస్తున్న నెల్లూరు పెద్దారెడ్ల పొలిటికల్ ఇష్యూస్

* వాలంటీర్ల అభినందన సభకు హాజరైన సీఎం జగన్
* వివిధ విభాగాల్లో 2.55 లక్షల మంది వాలంటీర్లకు సత్కారం
* సేవా వజ్ర నగదు పురస్కారం రూ.30వేల నుంచి రూ.45వేలకు పెంపు
* సేవా రత్న నగదు పురస్కారం రూ.20వేల నుంచి రూ.30వేలకు పెంపు
* సేవా మిత్ర నగదు పురస్కారం రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంపు
* మరో 2 నెలల్లో ఎన్నికలు.. యుద్ధానికి సిద్ధమా-జగన్
* వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారు
* పేదల బతుకులు మార్చాలని తపనపడే వాలంటీర్లంతా నా సైన్యమే
* స్థానిక సంస్థల ఎన్నికలు, ఉపఎన్నికల్లో విజయానికి వాలంటీర్లే కారణం
* వాలంటీర్ల వ్యవస్థతో ఇంటి వద్దకే సేవలు
* చంద్రబాబు పాలనలో స్కీములు లేవు, బటన్లు లేవు