Cm Jagan Jobs
CM Jagan : కారుణ్య నియామకాలపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని అర్హులైన ఒకరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగం కల్పించాలని సీఎం ఆదేశించారు. వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించాలని నవంబర్ 30 నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ చెప్పారు.
‘కారుణ్య నియామకాలకు సంబంధించిన ప్రక్రియ పారదర్శకంగా జరగాలి. నవంబర్ 30వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలి. కోవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో ఎంతమంది ఉద్యోగులు కరోనాతో మరణించారో వివరాలు సేకరించాలి’ అని జగన్ ఆదేశించారు. దీంతో ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై నివేదిక ఇచ్చేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఆ లెక్కలు వచ్చిన తర్వాత అర్హులను గుర్తించే బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించనుంది.
Black Grapes : బరువును తగ్గించి రోగ నిరోధక శక్తి పెంచే నల్ల ద్రాక్ష
వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, విలేజ్ అర్బన్ హెల్త్ ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకం, కరోనా వాక్సినేషన్, కరోనా నివారణ చర్యలు, జిల్లాల కేంద్రాలు-కార్పొరేషన్లలో హెల్త్ హబ్స్ ఏర్పాటు తదితర అంశాలపైనా అధికారులతో చర్చించారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
ఆస్పత్రుల్లో ఖాళీలపై నియామక క్యాలెండర్‌ను రూపొందించామని.. ఈనెల 20న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. జాతీయ ప్రమాణాల ప్రకారం ఆస్పత్రుల్లో సిబ్బంది ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. 176 కొత్త పీహెచ్‌సీల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.
Heart Attack : షుగర్ వ్యాధి మందులతో గుండెపోటు ముప్పు పొంచివుందా?..
బొగ్గు సరఫరా, విద్యుత్‌పై ప్రణాళిక, దీర్ఘకాలిక వ్యూహాలపైనా అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత రాకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణలోని సింగరేణి, కోల్ ఇండియాతో సమన్వయం చేసుకోవాలని.. బొగ్గు తీసుకొచ్చే ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు.