CM Jagan Oxygen : సీఎం జగన్ మరో కీలక నిర్ణయం, విదేశాల నుంచి ఆక్సిజన్ కొనుగోలు

ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో సరిపడ ట్యాంకర్లు లేవని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కంటైనర్ ట్యాంకర్ల కొనుగోలుకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారు. అంతేకాదు అవసరమైతే విదేశాల నుంచి ఆక్సిజన్ కూడా కొనుగోలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. విదేశాల్లో ఆక్సిజన్ సరఫరా చేసే వారి వివరాలు సేకరించాలని సీఎం జగన్ ఆదేశించారు.

CM Jagan Oxygen Purchase : ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో సరిపడ ట్యాంకర్లు లేవని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కంటైనర్ ట్యాంకర్ల కొనుగోలుకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారు. అంతేకాదు అవసరమైతే విదేశాల నుంచి ఆక్సిజన్ కూడా కొనుగోలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. విదేశాల్లో ఆక్సిజన్ సరఫరా చేసే వారి వివరాలు సేకరించాలని సీఎం జగన్ ఆదేశించారు.

ఏపీపై పగబట్టిన కరోనా:
కరోనా మహమ్మారి ఏపీపై పగబట్టినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 1,14,299 శాంపిల్స్ ని పరీక్షించగా రికార్డు స్థాయిలో 23వేల 920 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 83 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 8,136 కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 11,45,022 చేరింది. వీరిలో ఇప్పటివరకు 9,93,708 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో 11,411 మంది డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,178 కి పెరిగింది.

ఏపీలో ఇక డే కర్ఫ్యూ:
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటిక నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం ఇప్పుడు డే కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మే 5వ తేదీ నుంచి పగటి పూట కర్ఫ్యూ అమలు చేసే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు.

రాష్ట్రంలో ఉదయం 6 నుంచి 12 గంటల వరకు యధావిధిగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని… మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని చెప్పారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా.. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా కర్ఫ్యూ అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ అధికారులతో సమీక్షించారని ఆళ్లనాని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు