CM Jagan : వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. వైసీపీ కో-ఆర్డినేటర్లు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా వైసీపీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు హాజరుకానున్నారు. గృహ సారథులుగా నియమితులైన వారి తుది జాబితాను నిర్దేశిత ఫార్మాట్స్ లో సమర్పించాలని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలను వైసీపీ అధిష్టానం ఆదేశించింది. దీంతో తుది జాబితాను సమర్పించనున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గృహ సారథుల నియామకాలు పూర్తయ్యాయి. గృహ సారథుల భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. మరోవైపు పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ తీసుకునే చాన్స్ ఉంది.
Also Read..Chandrababu Naidu : జగన్ ఓటమి ఖాయం, ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల పనితీరు, గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష చేయనున్నారు సీఎం జగన్. ఇప్పటికే దీనిపై చాలాసార్లు వర్క్ షాప్ నిర్వహించారు. ఈసారి మాత్రం కీలకం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వారి పని తీరు ఏ విధంగా ఉందనే అంశానికి సంబంధించి వర్క్ షాప్ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎం జగన్ పూర్తి వివరాలు చెప్పబోతున్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఎమ్మెల్యేల పని తీరు ఏ విధంగా అన్న దానిపై సర్వేలు చేయించారు సీఎం జగన్. ఆ సర్వేల రిపోర్టుని సమీక్షలో రివీల్ చేయనున్నారు జగన్. తక్కువగా పని తీరు కనబరిచిన వారికి ఇప్పటికే పలు మార్లు క్లాస్ తీసుకున్నారు జగన్. ఇప్పుడు మరోసారి అలాంటి ఎమ్మెల్యేలకు సీరియస్ గా క్లాస్ తీసుకునే చాన్స్ ఉంది.
గడపకు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎవరైతే సక్రమంగా నిర్వహిస్తారో వారికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉంటాయని ఇప్పటికే జగన్ పలు మార్లు స్పష్టం చేశారు. పని తీరు బాగోలేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని ముందు నుంచి కూడా జగన్ హెచ్చరిస్తున్న మాట. నేటి సమావేశం చాలా కీలకంగా భావిస్తున్నారు. పనితీరు మెరుగు పరుచుకోని వారికి కొంత సీరియస్ గానే సీఎం జగన్ క్లాస్ తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం జగన్. అంతేకాదు.. 175 స్థానాలు టార్గెట్ గా పెట్టుకున్నారు. కచ్చితంగా అనుకున్నది సాధించాలని పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. ఆ దిశగా ఎమ్మెల్యేలంతా శ్రమించాలని పదే పదే చెబుతున్నారు.