CM Jagan : ఏపీలో పలు విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ : సీఎం జగన్

పర్యావరణ హితంగా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు.

CM Jagan Solar power projects

CM Jagan  Solar Power Projects : ఏపీలో పలు విద్యుత్ ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. వర్చువల్ గా ప్రాజెక్టులకు శంకుస్థాసన చేశారు. నంద్యాల జిల్లా అవుకు మండలం పిక్కలపల్లి తండా సమీపంలో గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ సోలార్ పవర్ ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ ప్రాజెక్టులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థకు 2,300 మెగావాట్ల సౌర విద్యుత్ కు సంబంధించి రూ.10,300 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లుగా పేర్కొన్నారు.  10,300 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడమే కాకుండా 2,300 మందికి ఉద్యగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

Audimulapu Suresh : ఆ పని వైసీపీ వాళ్లే చేశారని తేల్చితే రాజకీయ సన్యాసం తీసుకుంటా : మంత్రి ఆదిమూలపు

8 వేల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యావరణ హితంగా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు.