CM Jagan lays foundation stone for three reservoirs : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని.. మూడు రిజర్వాయర్లకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. తోపుదుర్తి, దేవరకొండ, ముట్టాల రిజర్వాయర్ల పనులను ప్రారంభించారు.
రూ.8,400 కోట్లతో 5 రిజర్వాయర్లను నిర్మిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. 90 రోజుల్లో 5 జలాశయాల్లో నీరు నింపుతామని చెప్పారు. 75 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
అనంతరం జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకంలో భాగంగా సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం నేడు ఒప్పందం చేసుకుంది.