CM Jagan West Godavari : రేపు గృహహక్కు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్
సీఎం జగన్ మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ జిల్లా నుంచే సంపూర్ణ గృహహక్కు పథకానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
- kunduru Vinod
- Published On : December 20, 2021 / 01:28 PM IST
Cm Jagan West Godavari
CM Jagan West Godavari : సీఎం జగన్ మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ జిల్లా నుంచే సంపూర్ణ గృహహక్కు పథకానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ఉదయం 10.30 తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి ఉదయం 11 గంటలకు తణుకు చేరుకుంటారు సీఎం. స్థానిక హైస్కూల్ లో పేర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. ఇక్కడే సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభిస్తారు.
అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సీఎం జగన్ తిరిగి తాడేపల్లి పయనమవుతుటారు. జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సభకు హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బందుకు కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం జిల్లాకు వస్తుండటంతో జిల్లా నేతలు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.
చదవండి : CM Jagan : ఆదాయం తగ్గింది, ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది
