CM Jagan : బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి..మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడంలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

CM Jagan : బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి..మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

Cm Jagan

CM Jagan exgratia announce : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడంలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ ను జగన్ ఆదేశించారు.

జంగారెడ్డిగూడంలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు జల్లేరువాగులో పడిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదంలో డ్రైవర్ సహా 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Bus Accident : బస్సులో టెక్నికల్ సమస్యలు లేవు..మానవ తప్పిదం వల్లే ప్రమాదం

బస్సు వంతెన రెయిలింగ్ ను ఢీకొని జల్లేరువాగులో బోల్తా పడింది. 50 అడుగుల ఎత్తు నుంచి బస్సు వాగులో పడింది. ప్రమాదానికి గురైన బస్సు..జంగారెడ్డిగూడెం డిపోకు చెందినదిగా గుర్తించారు. క్రేన్ సహాయంతో అధికారులు బస్సును బయటికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారు. కాగా బస్సు వేలేరుపాడులో నైట్ హాల్ట్ ఉన్నది. ఉదయం భద్రాచలం వెళ్లి అశ్వారావుపేట మీదుగా జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తోంది. జంగారెడ్డిగూడెంకు 10 కి.మీ దూరంలో బస్సు ప్రమాదానికి గురైంది.