CM Jagan Nellore Tour : రేపు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. బ్యారేజ్‌లు ప్రారంభించి జాతికి అంకితం

సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. బ్యారేజ్ లు ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. పెన్నా నదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిని, నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.

CM Jagan Nellore Tour : సీఎం జగన్ మంగళవారం (సెప్టెంబర్ 6,2022) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో బ్యారేజ్ లు ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు సీఎం జగన్. పెన్నా నదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిని జగన్ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగసభలో మాట్లాడతారు. ఆ తర్వాత నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. బ్యారేజ్ లను ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ వీటిని జాతికి అంకితం చేయనున్నారు.

ఈ పర్యటన నిమిత్తం రేపు మంగళవారం ఉదయం 9.30 గంటలకు సీఎం జగన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరతారు. 10.40 గంటలకు సంగం బ్యారేజి వద్దకు చేరుకుని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం, అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.45 గంటలకు నెల్లూరు చేరుకుంటారు. అక్కడ నిర్మించిన బ్యారేజి కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. మధ్నాహ్నం 2.20 గంటలకు తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

సీఎం జగన్ షెడ్యూల్..
* 6వ తేదీ ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరతారు.
* 10.40 గంటలకు సంగం బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు.
* 11 గంటల నుంచి 1.10 వరకూ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ను ప్రారంభించి, అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు.
* 1.20 గంటలకు సంగం నుంచి బయలుదేరి 1.45 గంటలకు నెల్లూరు బ్యారేజి సైట్ కు చేరుకుంటారు.
* 1.50 గంటల నుంచి 2.20 గంటల వరకూ నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ ని ప్రారంభిస్తారు.
* 2.20 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

కాగా సంగం బ్యారేజీ నిర్మాణం ద్వారా పెన్నా నదికి వరద ముప్పును సమర్థవంతంగా ప్రభుత్వం నియంత్రించనుంది. బ్యారేజ్‌లో 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉండటం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగనున్నాయని అధికారులు తెలిపారు. తద్వారా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీరుతాయన్నారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్యను ప్రభుత్వం పరిష్కరించనుంది. గతంలో పెన్నాలో వరద పెరిగితే ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించేవి.