Cm Jagan Free Ration
CM Jagan : భారీ వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టించాయి. కనీవిని ఎరుగని రీతిలో వచ్చిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ఎటుచూసినా నీరే కనిపిస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ఊర్లు చెరువులను తలపిస్తున్నాయి. జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో సర్వస్వం కోల్పోయారు. కట్టుబట్టలతో మిగిలారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు.
Burning Plastic – Garbage: బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేదా ప్లాస్టిక్ కాలిస్తే రూ.5వేల ఫైన్
ఈ క్రమంలో వరద బాధిత కుటుంబాలకు సీఎం జగన్ ఊరటనిచ్చే వార్త చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత నిత్యావసర సరకులు పంపిణీకి ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళాదుంపలను ఉచితంగా సరఫరా చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని వరద బాధితులకు ఈ ఉచిత సాయం అందనుంది.
Instant Covid Test : కాఫీతో కోవిడ్ టెస్ట్ చేయొచ్చు… ఇదిగో ప్రాసెస్..!
ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్ మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ పర్యవేక్షించాలని జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాల్సిన అవసరం లేదని జగన్ సూచించారు. ఈ మేరకు వారు ప్రజలకు తక్షణ సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.
వరదల కారణంగా జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టంపై అంచనాలను ప్రభుత్వానికి అందించాలని సూచించారు. మరోవైపు వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులు తిరిగి పంటలు వేసుకునేలా వాళ్లకు విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వానలు కురిశాయి. వరదలు పోటేత్తాయి. అపారమైన ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. రవాణ వ్యవస్థ తీవ్ర దెబ్బతింది.