కరోనా టెస్ట్‌ల్లో ఏపీయే నెంబర్ 1, గ్రీన్‌జోన్లలో త్వరలో లాక్‌డౌన్ ఎత్తివేస్తాం :సీఎం జగన్

  • Publish Date - April 29, 2020 / 11:29 AM IST

కరోనా వైరస్ కట్టడికి నెల రోజుల్లో ఏన్నో చేయడం జరిగిందని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకున్నామన్నారు ఏపీ సీఎం జగన్. నెల రోజుల్లో టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకొని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ నిలిచిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక కరోనా వైరస్ బారిన పడిన వారికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగిందని వెల్లడించారు.

2020, ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న..తీసుకొనే చర్యలను వివరించారు. ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా పేద వారికి మేలు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్లామని తెలిపారు. వైద్య సిబ్బందిని పూర్తిస్తాయిలో నియమాకాలు చేయడం జరిగిందన్నారు. 

టెస్టుల పరిస్థితి చూస్తే..ఏపీ రాష్ట్రం ప్రథమ స్థానంలో కొనసాగుతోందన్నారు. 9 ల్యాబ్ లో కరోనా పరీక్షలు చేస్తున్నామని, 10 లక్షల మందిలో 1396 మందికి టెస్టులు చేయడం జరుగుతోందన్నారు. 5 కోవిడ్ క్రిటికల్ కేర్ ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగిందని, 74, 551 మందికి పరీక్షలు చేశామన్నారు. 9 వీఆర్డీఏ ల్యాబ్ లు పని చేస్తున్నాయన్నారు. క్వారంటైన్ లో ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నామన్నారు సీఎం జగన్. 

రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ఇప్పటికే గుర్తించామని, నాలుగు కంటే ఎక్కువ కేసులు వస్తే రెడ్ జోన్,  1-4 కేసులు ఉంటే ఆరెంజ్ జోన్ ఉన్నాయి. 63 మండలాలు రెడ్ జోన్, 53 మండలాలు ఆరెంజ్ జోన్ లో,  559 మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. 25 వే బెడ్లతో సింగిల్ బెడ్ రూం లు సిద్ధంగా చేశామని చెప్పిన సీఎం జగన్ 15 వేల బెడ్లతో డబుల్ బెడ్ రూమ్ లు సిద్ధ చేశామన్నారు. ఇప్పటికే మూడుసార్లు సర్వే చేశారని, ఇందులో పాల్గొన్న ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్లకు హ్యాట్సాఫ్ చెబుతున్నానన్నారు. 

రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా..సామాన్యుడికి కష్టం రాకుండా చేశామని, నెలకు మూడుసార్లు సరుకులు ఇచ్చామన్నారు. ప్రతి పేదింటికి రూ. 1000 ఇచ్చామన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రూ. 2 వేల 250 రూపాయల పెన్షన్ ను లబ్దిదారులకు ఇంటింటికి వెళ్లి అందించారన్నారు.