Cm Jagan
YSR Law Nestham Scheme: రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని అమలు చేస్తున్న విషయం విధితమే. ఈ పథకంలో భాగంగా అర్హులైన జూనియర్ లాయర్లకు ప్రతీనెల రూ.5వేలు వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. ఇందుకు సంబంధించి మూడో విడత వైఎస్ఆర్ లా నేస్తం నిధులను సీఎం జగన్ మోహన్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2,011 మంది జూనియర్ న్యాయవాదులకోసం రూ. 1,00,55,000 నిధులు జమయ్యాయి.
YS Jagan: ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం చేస్తున్నాం
నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా ‘లా నేస్తం’ నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపేందుకు లా నేస్తం అని అన్నారు. లా డిగ్రీ తీసుకున్న తర్వాత తొలి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు లా నేస్తం కచ్చితంగా ఉపయోగపడుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే బుధవారం సీఎం జగన్ విడుదల చేసిన నిధులతో కలిపి ఇప్పటి వరకు 4,248 మంది న్యాయవాదులకు మూడున్నరేళ్లలో అందించిన ఆర్థిక సాయం మొత్తం రూ. 35. 40కోట్లుకు చేరింది.
AP CM YS Jagan: విశాఖ రాజధానిపై గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు ..
సీఎం జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చింది. ఇదే సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ. 100 కోట్లతో కార్సస్ ఫండ్ సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్ నుంచి ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది.