CM Jagan Review : ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనాకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు : సీఎం జగన్

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనాకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. కరోనా నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Cm Jagan Review On Corona Outbreak Vaccination

CM jagan review on corona outbreak, vaccination : ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనాకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. కరోనా నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రోగులెవరైనా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరాలనుకుంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా ధరలను నిర్దేశించాలని అధికారులను ఆదేశించారు.

బోర్డులపై ప్రదర్శించిన ధరలకంటే అధికంగా వసూలు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో ప్రజలకు వివరించాలని సీఎం చెప్పారు. రోగులకు ఎక్కడా బెడ్ల కొరత రాకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఉన్న బెడ్స్ వివరాలు అధికారుల దగ్గర ఉండాలని సూచించారు. 104 కాల్‌ సెంటర్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలని.. కోవిడ్ లక్షణాలున్నవారు ఫోన్ చేస్తే వారికి తగిన సలహాలివ్వాలని జగన్ సూచించారు.

ఫోన్ చేసిన 3 గంటల్లోగా బెడ్ కేటాయించాలని.. అవసరమైన దానికంటే ఆక్సిజన్‌ ఎక్కువ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కరోనా వ్యాక్సిన్ల కోసం మరోసారి కేంద్రానికి లేఖ రాయాలని అధికారులకు సూచించారు. నిన్న ఒకేరోజు సుమారు ఆరున్నర లక్షల మందికి వ్యాక్సిన్ అందించడంపై అధికారులను అభినందించారు.