సినిమాల్లో హీరో విలన్ ను కాల్చేస్తే, చప్పట్లు కొడతాం. చట్టాల్లో ఆ స్వేచ్ఛ లేదు

  • Publish Date - February 8, 2020 / 07:51 AM IST

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణ ఘటనలను చూస్తుంటే..చాలా బాధేస్తుందని, ఇలాంటి ఘటనల్లో వారికి శిక్ష పడేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చామన్నా సీఎం జగన్. 2020, ఫిబ్రవరి 08వ తేదీ శనివారం రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన చట్టం, ఇతర విషయాలపై ఆయన మాట్లాడారు.

ఏపీ రాష్ట్రంలో చిన్న పిల్లలను సైతం వదలని దారుణ ఘటనలు సమాజంలో చూస్తున్నామన్నారని వెల్లడించారు. మద్యం తాగిన కొంతమంది మనుషులు రాక్షసులుగా మారుతున్నారని, వారు ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి నెలకొంటున్నాయన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్న సమయంలో వీరిని ఏం చేసినా..ఫర్వాలేదు అని అందరికీ అనిపిస్తుందన్నారు. సినిమాలో హీరో..కాల్చేస్తుంటే..అందరూ చప్పట్లు కొడుతుంటారని తెలిపారు. 

కానీ చట్టాలు మాత్రం స్వేచ్చను ఇవ్వదనే విషయాన్ని గుర్తు చేశారు. జరిగిన ఘటనలు చూస్తుంటే..మాత్రం విపరీతమైన కోపం వస్తుందని, న్యాయం మాత్రం ఆలస్యంగా జరుగుతూ ఉంటుందన్నారు. ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు బాధగా ఉంటుందని, చట్టాలపై ఉన్న గౌరవం కూడా పోయే పరిస్థితి వస్తుందన్నారు. ఇందుకు నిర్భయ ఘటనే నిదర్శనమన్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో దిశ చట్టాన్ని తీసుకరావడం జరిగిందని, త్వరతగతిన న్యాయం అందించాలనే ఉద్దేశ్యం, వెంటనే శిక్షలు పడే విధంగా చూసేందుకు తాము ఈ చట్టాన్ని తీసుకరావడం జరిగిందన్నారు. దీనివల్ల సమాజంలో భయం అనేది ఉత్పన్నమౌతుందన్నారు. 
ఏ సంవత్సరంలో ఎన్ని దారుణాలు జరిగాయంటే…

2014లో 13 వేల 549 కేసులు.  2015లో 13 వేల 088 కేసులు, 2016లో 13 వేల 947 కేసులు, 2017లో 14 వేల 696 కేసులు, 2018లో 14 వేల 048 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 
 రేప్ కేసులు :  2014లో 937, 2015 1014 కేసులు, 2016లో 969 కేసులు, 2017లో 1046 కేసులు, 2018లో 1096 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు
చిన్నపిల్లల కేసులు : (బాలికలు) 2014లో 4,032, 2015లో 4,114, 2016లో 4,477, 2017లో 4,672, 2018లో 4,215 కేసులు నమోదయ్యాయని సీఎం జగన్ వెల్లడించారు.