CM Jagan in Delhi: 9 అంశాలని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లిన సీఎం జగన్: నేడు అమిత్ షాతో భేటీ

పోలవరం ప్రాజెక్ట్ నిధులు, తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు సహా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించిన 9 అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు ఏపీ సీఎం జగన్.

CM Jagan in Delhi: పోలవరం ప్రాజెక్ట్ నిధులు, తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు సహా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించిన 9 అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు ఏపీ సీఎం జగన్. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్..వెంటనే ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. ఈసందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ నిధులు, తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు, కొత్త జిల్లాల్లో వైద్య కళాశాల మంజూరు, కడప ఉక్కు కర్మాగారానికి ఇనుప ఖనిజం, రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీ.. రుణపరిమితి పునరుద్ధరణ, రేషన్ కోట పెంపు, భోగాపురం విమానాశ్రయానికి అనుమతులు పొడిగింపు, రాష్ట్ర మైనింగ్ శాఖకు బీచ్ శాండ్ కేటాయింపులు వంటి 9 అంశాలతో ప్రధానికి వినతి పత్రం సమర్పించారు సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టుపై చేసిన ఖర్చును..విడివిడిగా కాకుండా..మొత్తం ప్రాజెక్టు ఖర్చుగా చూడాలని..ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలనీ సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

other stories: Gyanvapi Mosque: ప్రతి మసీదులో శివలింగాన్ని ఎందుకు వెతుకుతున్నారు – ఆర్ఎస్ఎస్ చీఫ్

సీఎం జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన 9 అంశాల్లో దాదాపు సగం అంశాలు పాతవే ఉన్నాయి. దాదాపు గంటన్నర పాటు ప్రధాని మోదీతో భేటీ అయిన జగన్..అనంతరం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ను కలిశారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి, అప్పులు, ప‌న్నుల రాబ‌డి, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న స‌హ‌కారం, ఇంకా అందాల్సిన మ‌ద్ద‌తు త‌దిత‌రాల‌ను కేంద్ర మంత్రికి జ‌గ‌న్ వివ‌రించిన‌ట్లు స‌మాచారం. సాయంత్రం 5.30 గంట‌ల‌కు మొదలైన‌ వీరి భేటీ కేవ‌లం 10 నిమిషాల్లోనే ముగియడం గమనార్హం. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తోనూ భేటీ అయిన సీఎం జగన్..రాష్ట్రానికి సంబందించిన నీటి కేటాయింపులు ఇతర అంశాలపై చర్చించారు. కాగా శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు సీఎం జగన్. ఉదయం 10 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్నారు.

other stories: Amit Shah On Telangana : తెలంగాణలో త్వరలోనే ప్రభుత్వం మారబోతోంది-అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు