Amit Shah On Telangana : తెలంగాణలో త్వరలోనే ప్రభుత్వం మారబోతోంది-అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Amit Shah On Telangana : తెలంగాణలో త్వరలోనే ప్రభుత్వం మారబోతోంది-అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Amit Shah On Telangana

Amit Shah On Telangana : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ అగ్ర నాయకులు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కేసీఆర్ సర్కార్ టార్గెట్ గా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. పాదయాత్ర పేరుతో జనాలతో టచ్ లో ఉంటున్నారు. ఇక ఆ పార్టీ అగ్ర నాయకులు.. ఛాన్స్ చిక్సితే చాలు.. తెలంగాణలో వాలిపోతున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం అని జోస్యం చెబుతూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణలో ప్రభుత్వం మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో ప్రభుత్వం మారబోతోందని షా జోస్యం చెప్పారు.

Bhatti Vikramarka : మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు : బండి సంజయ్‌పై భట్టివిక్రమార్క ఫైర్

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఉద్య‌మం, తెలంగాణ ప‌ట్ల కేంద్రం వైఖ‌రి, రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం మార‌బోతోందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

”తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్య‌మం జ‌రిగింది. 2004 నుంచి 2014 వ‌ర‌కు తెలంగాణ డిమాండ్‌ను కాంగ్రెస్ ప‌ట్టించుకోలేదు. 2014 ఎన్నిక‌ల కోస‌మే తెలంగాణ‌ను హ‌డావిడిగా ప్ర‌క‌టించారు” అని షా ఆరోపించారు.

అన్ని రాష్ట్రాల అభివృద్ధికి మోదీ స‌ర్కార్ క‌ట్టుబ‌డి ఉందన్న అమిత్ షా.. తెలంగాణ‌పై ఏనాడూ స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూపించ‌లేదన్నారు. త‌మ‌కు తెలంగాణ‌పై ఎలాంటి వివ‌క్ష లేదన్న ఆయ‌న.. ఏ ముఖ్య‌మంత్రి ఢిల్లీకి వ‌చ్చినా గౌర‌విస్తామ‌ని తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం పురోగ‌మిస్తుంద‌ని తాము న‌మ్ముతామ‌ని షా అన్నారు.

Telangana formation day: తెలుగులో ట్వీట్లు చేసి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మోదీ, షా శుభాకాంక్ష‌లు

అతి త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో ప్ర‌భుత్వం మార‌బోతోందని అమిత్ షా చెప్పారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం స్థానంలో బీజేపీ కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక తెలంగాణ విమోచ‌న దినాన్ని అధికారికంగా నిర్వ‌హిస్తామ‌ని అమిత్ షా ప్ర‌క‌టించారు.