CM Jagan : జనంలోకి జగన్‌.. డిసెంబర్ 2 నుంచి నేరుగా…

భారీ వర్షాలు, వరదలు ఏపీని అతలాకుతలం చేశాయి. కనీవిని ఎరుగని రీతిలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

CM Jagan : భారీ వర్షాలు, వరదలు ఏపీని అతలాకుతలం చేశాయి. కనీవిని ఎరుగని రీతిలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. ఎటుచూసినా వరద నీరే కనిపిస్తోంది.

Bigg Boss 5 : ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన రవి.. అందుకే బిగ్ బాస్ నుంచి అవుట్ అయ్యాడా??

వరద ప్రభావిత ప్రాంతాలపై ఇప్పటికే ఆరా తీసిన సీఎం జగన్‌ ఈ నెల 2న స్వయంగా తానే జనం దగ్గరకి వెళ్లనున్నారు. నేరుగా వరద బాధితులతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత జిల్లాల్లో పంట, ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలను జగన్‌ తెప్పించుకున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకే జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్ బాధితులను పరామర్శిస్తారు. ఇదే పర్యటనలో వరద నష్టంపై పరిహారం ప్రకటించే అకాశం ఉంది.

Ghee : గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి నెయ్యి వాడకం మంచిది కాదా?

కాగా, వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో సీఎం జగన్ ఇప్పటికే ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించారు.

ట్రెండింగ్ వార్తలు