Bigg Boss 5 : ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన రవి.. అందుకే బిగ్ బాస్ నుంచి అవుట్ అయ్యాడా??

అయితే రవి ముందే వెళ్లిపోవడానికి రెండు కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రవి రెమ్యునరేషన్. బిగ్ బాస్ లో ఉన్నందుకు కంటెస్టెంట్స్ కి వారానికి ఇంత అని రెమ్యునరేషన్............

Bigg Boss 5 : ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన రవి.. అందుకే బిగ్ బాస్ నుంచి అవుట్ అయ్యాడా??

Ravi

Bigg Boss 5 :  బిగ్‌బాస్‌ షోలో ఏదైనా జరగొచ్చు అని మరోసారి రుజువైంది. ఇది పేరుకే రియాల్టీ షో అయినా స్క్రిప్టెడ్ షో అని చాలా మందికి తెలుసు. మనం ఎలిమినేట్ అనుకున్న కంటెస్టెంట్లు సేవ్‌ అవ్వొచ్చు, సేవ్ అనుకున్న వాళ్ళు ఎలిమేట్ అవొచ్చు. తాజాగా బిగ్ బాస్ లో ఇదే జరిగింది. 19 మందితో మొదలైన బిగ్ బాస్ లో ఇప్పటికే 11 మంది ఎలిమినేట్ అయ్యారు. 12వ వారంలో అనుకోకుండా రవి ఎలిమినేట్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు.

Shivashankar Master : శివశంకర్ మాస్టర్ గురించి మీకు తెలియని విషయాలు..

యాంకర్ రవి టాప్‌ 5లో కాదు ఏకంగా టాప్‌ 3లోనే ఉంటాడు అనుకున్నారు ప్రేక్షకులు. ప్రతి వారం రవి నామినేషన్ లో ఉన్నా అందరి కంటే ఎక్కువ ఓట్లు పడి సేవ్ అవుతూ వచ్చాడు. కాని ఈ వారం ఎలిమినేట్ చెయ్యడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. రవి ఎలిమినేషన్ ని తప్పు పడుతూ రవి అభిమానులు బిగ్ బాస్ సెట్ బయట నిన్న అర్ధరాత్రి ధర్నా కూడా చేశారు. ఇది అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అంటూ బిగ్‌బాస్‌ను తిడుతూ కామెంట్లు చేస్తున్నారు. కాజల్‌, సిరి, ప్రియాంక కంటే రవికే తక్కువ ఓట్లు వచ్చాయంటే ఎవ్వరూ నమ్మరు అని అంటున్నారు. రవిని బిగ్‌బాస్‌ హౌస్‌లో మళ్ళీ కొనసాగించాలని కోరుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు రవి ఫ్యాన్స్.

Shivashankar Master : శివశంకర్ మాస్టర్ మరణంతో ఆందోళనలో టాలీవుడ్.. కరోనా ఇంకా పోలేదు

అయితే రవి ముందే వెళ్లిపోవడానికి రెండు కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రవి రెమ్యునరేషన్. బిగ్ బాస్ లో ఉన్నందుకు కంటెస్టెంట్స్ కి వారానికి ఇంత అని రెమ్యునరేషన్ ఇస్తారు నిర్వాహకులు. వాళ్ళకి ఉన్న ఫాలోయింగ్ ని బట్టి వాళ్ళ స్టార్ డంని బట్టి ఈ రెమ్యునరేషన్ ఉంటుంది. అయితే హౌస్ లో అందరి కంటే రవికే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం. వారానికి దాదాపు 7 లక్షల రూపాయల వరకు రవికి అత్యధిక పారితోషికం ఇచ్చినట్టు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి సమాచారం. ఈ లెక్కన రవి 12 వారాలకు దాదాపు 80 లక్షల పైగానే సంపాదించాడు. అయితే బిగ్ బాస్ ప్రైజ్‌మనీ 50 లక్షలు మాత్రమే. ప్రైజ్‌మనీ కన్నా రవి రెమ్యునరేషన్ ఎక్కువ ఉండటంతో, బిగ్ బాస్ షో కూడా చివరి దశకు రావడంతో రవిని పంపించేసినట్లు సమాచారం. ఇందుకు రవి కూడా ఒప్పుకోవడంతో రవిని నిన్న ఎలిమినేట్ చేశారు.

Shivashankar Master : వెన్నెముక విరిగి ఎనిమిదేళ్లు మంచం పైనే.. తర్వాత 800 సినిమాలకి కొరియోగ్రఫీ

అంతే కాక ఎప్పటిలాగే ఫైనల్ లో టాప్ 5లో ఒక లేడీ కంటెస్టెంట్‌ను కూడా పంపించాలి, అప్పటి వరకు హౌస్ లో లేడీ కంటెస్టెంట్స్ ఉంటె బెటర్ అని భావించి కూడా తనని పంపించినట్లు తెలుస్తుంది అని రవినే ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఈ ఎపిసోడ్ తో ఇప్పటికైనా ఇది స్క్రిప్టెడ్ షో అని నమ్మండి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అది కూడా నిజమే కదా అనిపిస్తుంది చూస్తుంటే.