Shivashankar Master : వెన్నెముక విరిగి ఎనిమిదేళ్లు మంచం పైనే.. తర్వాత 800 సినిమాలకి కొరియోగ్రఫీ

డాక్టర్ దగ్గరికి శివశంకర్‌ను తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీసి, వెన్నెముక విరిగిపోయిందని నిర్థారించారు. ఈయన నడవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అని చెప్పారు. దీంతో శివశంకర్........

Shivashankar Master : వెన్నెముక విరిగి ఎనిమిదేళ్లు మంచం పైనే.. తర్వాత 800 సినిమాలకి కొరియోగ్రఫీ

Shivashankar

Shivashankar Master :  గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న లెజెండరీ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ నిన్న రాత్రి మరణించారు. దీంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతిపై సంతాపం తెలుపుతూ నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఆయన గురించి మనకు తెలియని విషయాలెన్నో. ఇప్పుడు ఆయన మరణం తర్వాత శివశంకర్ మాస్టర్ కష్టం గురించి తెలుసుకొని ఆయన్ని అభినందిస్తున్నారు.

Dollar Seshadri: గుండెపోటుతో ‘డాలర్’ శేషాద్రి కన్నుమూత

శివశంకర్‌ మాస్టర్‌ 1948 డిసెంబరు 7న చెన్నైలో జన్మించారు. ఈయన తండ్రి కొత్వాల్‌ చావిడిలో హోల్‌సేల్‌ పండ్ల వ్యాపారం చేసేవారు. శివశంకర్‌కు ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడు వాళ్ల పెద్దమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుని ఇంటి బయట కూర్చుంది. అదే సమయంలో ఒక ఆవు తాడు తెంపుకొని రోడ్డుపైకి వచ్చింది. అది తమ మీదకు వస్తుందేమోనని శివశంకర్‌ పెద్దమ్మ భయపడి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లే సమయంలో గుమ్మం దగ్గర పడిపోయింది. ఆమె చేతిలో ఉన్న శివశంకర్‌ కూడా కింద పడిపోయాడు. దీంతో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమైంది.

Shivashankar Master : శివశంకర్ మాస్టర్ మరణంతో ఆందోళనలో టాలీవుడ్.. కరోనా ఇంకా పోలేదు

ఆ తర్వాత నెల రోజుల పాటు జ్వరం. ఏ డాక్టర్‌కు చూపించినా శివశంకర్ మాస్టర్ కి నయం కాలేదు. ఆ సమయంలో విదేశాల్లో డాక్టర్‌గా పనిచేసి మద్రాసు వచ్చిన నరసింహ అయ్యర్‌ అనే డాక్టర్ దగ్గరికి శివశంకర్‌ను తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీసి, వెన్నెముక విరిగిపోయిందని నిర్థారించారు. ఈయన నడవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అని చెప్పారు. దీంతో శివశంకర్ తల్లితండ్రులు బాధలో మునిగిపోయారు. అప్పుడు ఆ డాక్టర్‌ శివశంకర్‌ తల్లిదండ్రులతో ఈ పిల్లాడిని ఎవరి వద్దకు తీసుకెళ్లకుండా నా దగ్గర వదిలేయండి. నేను చికిత్స ఇచ్చి లేచి నడిచేలా చేస్తాను అని చెప్పడంతో సరే అన్నారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు శివశంకర్‌ పడుకునే ఉన్నారు.

Bigg Boss Telugu 5 Elimination : యాంకర్ రవికి అన్యాయం జరిగిందంటూ.. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఆందోళన

శివశంకర్‌కు ఎలాగైనా చదువు చెప్పించాలని ఆయన తండ్రి ట్యూషన్‌ పెట్టించారు. మంచం మీదే పడుకొని చదువుకునేవారు. ఆ తర్వాత 10 ఏళ్లకు లేచి నడవడం మొదలు పెట్టారు శివశంకర్ మాస్టర్. దీంతో నేరుగా అయిదో తరగతిలో చేరారు. అయితే లేచి నడిచినా ఇంకా పూర్తిగా గాయం మానకపోవడంతో పిల్లలతో ఆడుకోవటానికి అవకాశం ఉండేది కాదు. అప్పట్లో ‘సభ’ అని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఉండేది. అందులో శివశంకర్‌ తండ్రి సభ్యుడు. అందులో నాటకాలు, డ్యాన్సులు చూసి తాను కూడా డ్యాన్స్ చేయాలనీ చిన్నప్పుడే ఫిక్స్ అయ్యారు.

Sonu Sood : నా గుండె బద్దలైంది.. శివశంకర్ మాస్టర్ మృతిపై సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్

ఎలాగైనా డ్యాన్స్‌ చేయాలి, డ్యాన్సర్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యి ఎంత కష్టమైనా డ్యాన్స్ నేర్చుకున్నారు. 16 ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారు. అప్పటికి వెన్ను నొప్పి కూడా తగ్గిపోయింది. 10వ తరగతి అయ్యాక తర్వాత ఏం చేస్తావు అని వాళ్ల నాన్న శివ శంకర్‌ను అడిగారు. నేను డ్యాన్సర్ అవుతాను అంటే వాళ్ళ నాన్నకి నచ్చలేదు. ఆ తర్వాత శివశంకర్‌ జాతకం చూపిస్తే ఒక పండితుడు ఇతను పెద్ద డ్యాన్సర్‌ అవుతాడు వదిలెయ్‌ అని చెప్పడంతో అప్పట్నుంచి పూర్తిస్థాయిలో డ్యాన్స్ రంగంలోకి వచ్చారు శివశంకర్.

Chiranjeevi : శివశంకర్ మాస్టర్ కన్నుమూత.. సినీ పరిశ్రమకు తీరని లోటు

మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద శివశంకర్‌ నృత్యం నేర్చుకున్నారు. పదేళ్లు ఆయన దగ్గర శిష్యరికం చేసి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో సలీమ్‌ అనే డ్యాన్స్ మాస్టర్ దగ్గర సహాయకుడిగా చేరి కెరీర్‌ను మొదలు పెట్టారు. ఆ తర్వాత వివిధ భాషల్లో దాదాపు 800 సినిమాలకు పైగా కొరియోగ్రాఫహర్ గా పని చేశారు. ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించారు. ఈయన మరణం దేశ నృత్య పరిశ్రమకి తీరని లోటు.