Shivashankar Master : శివశంకర్ మాస్టర్ మరణంతో ఆందోళనలో టాలీవుడ్.. కరోనా ఇంకా పోలేదు

శివశంకర్ మాస్టర్ కరోనాతో మరణించడంతో టాలీవుడ్లో భయాందోళనలు పెరిగాయి. ఇది కరోనా మరణం కావడంతో టాలీవుడ్ ప్రముఖులు మళ్ళీ బయటకి రావడానికి ఆలోచిస్తున్నారు. అంతేకాక...............

Shivashankar Master : శివశంకర్ మాస్టర్ మరణంతో ఆందోళనలో టాలీవుడ్.. కరోనా ఇంకా పోలేదు

New Project

Shivashankar Master :  చాలా మంది కరోనా వైరస్ తగ్గిపోయింది ఇదివరకులా లేదు, ఎక్కువ మంది చనిపోవట్లేదు అని అనుకుంటున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. కానీ రోజూ వందల్లో కరోనా కేసులు వస్తున్నాయి. కొంతమంది కరోనాతో ప్రాణాలు కూడా వదిలేస్తున్నారు. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. గతంలో కరోనాతో టాలీవుడ్లో చాలా మంది సెలబ్రిటీలు కూడా మరణించారు. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం నుంచి కిందిస్థాయి టెక్నీషియన్స్ వరకు సినీ పరిశ్రమలో కరోనాతో చాలా మంది చనిపోయారు.

Bigg Boss Telugu 5 Elimination : యాంకర్ రవికి అన్యాయం జరిగిందంటూ.. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఆందోళన

అయితే గత కొద్దీ రోజులుగా ఇండస్ట్రీలో కరోనా మరణాలు, కరోనా కేసులు తగ్గాయి. దీంతో ఇండస్ట్రీ ఇదివరకులా పూర్తిగా షూటింగ్స్, సినిమా ఫంక్షన్స్ నిర్వహిస్తుంది. కానీ తాజాగా ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కరోనాతో మరణించడంతో టాలీవుడ్లో భయాందోళనలు పెరిగాయి. 800 సినిమాలకు పైగా కొరియోగ్రఫీ చేసిన లెజెండరీ డాన్స్ మాస్టర్ శివ శంకర్ కరోనా వైరస్ కారణంగా కన్నుమూశారు. ఆయనతో పాటు కుటుంబంలో మరో ముగ్గురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. శివశంకర్ మాస్టర్ పెద్ద కొడుకు పరిస్థితి కూడా సీరియస్‌గానే ఉంది. ఆయన కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.

Sonu Sood : నా గుండె బద్దలైంది.. శివశంకర్ మాస్టర్ మృతిపై సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్

ఇది కరోనా మరణం కావడంతో టాలీవుడ్ ప్రముఖులు మళ్ళీ బయటకి రావడానికి ఆలోచిస్తున్నారు. అంతేకాక శివశంకర్ మాస్టర్ గత కొన్ని రోజుల క్రితం టీవీ షోలలో కనిపించరు. ఇప్పుడు ఆ టీవీ షోలలో పాల్గొన్న అందరూ కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. ఒకపక్క సినిమా ఫంక్షన్స్ భారీగా నిర్వహిస్తుండటంతో అక్కడ కూడా కరోనా సోకే అవకాశాలు ఉన్నాయని మరోసారి గుర్తించారు. వైరస్ లేదు కదా అని ఇష్టమొచ్చినట్టు చేస్తే దాని ఫలితం ఊహించని విధంగా ఉంటుందని శివశంకర్ మాస్టర్ మరణం అందరినీ ఆలోచించేలా చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ, సినిమా ఫంక్షన్స్ ని తగ్గిస్తూ ముందుకెళ్తారా లేక మొండిగా ఏది ఏమైనా పర్లేదు అని అలాగే వెళ్తారా చూడాలి.

Chiranjeevi : శివశంకర్ మాస్టర్ కన్నుమూత.. సినీ పరిశ్రమకు తీరని లోటు

మరోపక్క కరోనా కేసులు పెరగడం, కొత్త వేరియంట్లు రావడంతో ప్రభుత్వం కూడా మరోసారి పాక్షిక లాక్ డౌన్ ని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అందరూ కరోనా అయిపోలేదనే సత్యం గ్రహించి జాగ్రత్తలు తీసుకోవాలి.