సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి విశాఖ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే

సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఇవాళ విశాఖ పట్టణంలో పర్యటించనున్నారు. వైజాగ్ విజన్ - ప్యూచర్ విశాఖ పేరిట నిర్వహిస్తున్న సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు.

CM Jagan

CM Jagan Visakha Tour : సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖ పట్టణంలో పర్యటించనున్నారు. విజన్.. విశాఖ పేరిట రాడిసన్ బ్లూ హోటల్ లో నిర్వహించే సదస్సులో సీఎం పాల్గొననున్నారు. అనంతరం వైజాక్ కన్వెన్షన్ లో జరిగే భవిత స్కిల్ డెవలప్ మెంట్, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం అవుతారు. ఉదయం 10.45 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా సీఎం జగన్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనులు చేయనున్నారు.

Also Read : Chandrababu Naidu : టీడీపీ-జనసేన పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా..
    ఉదయం 10.30 గంటలకు విజయవాడ నుంచి విమానంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు.
    విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10.45 గంటలకు మధురవాడ ఐటీ హిల్స్ నెంబర్ -3కు వెళ్తారు.
    స్థానిక ప్రజాప్రతినిధులతో ఇంటరాక్ట్ అవుతారు.
    అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాడిసన్ బ్లూ రిసార్ట్స్ కు 11గంటలకు చేరుకుంటారు.
    విజన్ – విశాఖ పేరిట నిర్వహించే సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు.
    మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ కు సీఎం చేరుకుంటారు.
    అక్కడ భవిత స్కిల్ డెవలప్ మెంట్, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో జగన్ సమావేశమవుతారు.
    మధ్యాహ్నం 1.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధురవాడ ఐటీ హిల్స్-3పైకి చేరుకుంటారు.
    మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకొని, విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు బయలుదేరుతారు.

Also Read : Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ ఎవరి వైపు? ఆ 3 పార్టీల వ్యూహాలు ఏంటి?

  • అభివృద్ధి పనులు..
    సీఎం జగన్ విశాఖ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రూ. 98 కోట్లతో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ఐటీఐలు, పాలిటెక్కినక్ కళాశాలలను సీఎం వర్చువల్ గా ప్రారంభిస్తారు. సుమారు రూ. 100 కోట్లతో ముడసర్లోవలో నిర్మించనున్న జీవీఎంసీ నూతన భవనానికి జగన్ శంకుస్థాపన చేస్తారు. రూ. 10కోట్లతో టెర్టెల్ పార్క్ పనులకు శ్రీకారం చుడతారు. వెంకోజీపాలెం నుంచి మారియట్ హోటల్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, మధురవాడకు కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఏర్పాటు చేయనున్న వాటర్ సప్లయ్ ప్రాజెక్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం తదితర ప్రాజెక్టులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు