CM Jagan Visit's to Chittoor
CM Jagan Visit to Chittoor : అమూల్ డెయిరీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..2002లో కుట్ర చేసిన మూసి వేసిన చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామని అన్నారు. నా పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చానని తెలిపారు. ఒక పథకం ప్రకారం చంద్రబాబు అమూల్ డెయిరీని నష్టాల్లోకి నెట్టేసి మూసివేశారని ఆరోపించారు.తన సొంత హెరిటేజ్ డెయిరీ కోసం చిత్తూరు అమూల్ డెయిరీని మూసివేశారని ఆరోపించారు.సహకారం రంగంలో ఉన్న చిత్తూరు డెయిరీ నష్టాల్లోకి, హెరిటేజ్ డెయిరీ లాభాల్లోకి వెళ్ళడం ఆశ్చర్యం వేస్తుందన్నారు.ఇచ్చిన మాట ప్రకారం పాత బకాయిలు తీర్చి, ఈ డెయిరీ ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు.
అమూల్ సంస్థ 385 కోట్ల పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. సహకార రంగంలో ఏర్పాటు అవుతున్న అమూల్ డెయిరీ లాభాలను ప్రతి ఆరునెలల రైతులకు పంచుతారు…10 నెలల కాలంలో లక్ష లీటర్లతో ఇక్కడ పాల ప్రాసెసింగ్ ప్రారంభం అవుతుందని వెల్లడించారు.10 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ స్థాయికి ఇది వెళుతుందన్నారు. ఈ డెయిరీ ఓపెన్ చేయటం వల్ల ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, రెండు లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని అలాగే లక్షలాది మంది రైతులకు ఇది సంతోషం పంచుతుందని అన్నారు.
Chegondi Hari Rama Jogaiah : జగన్ సినిమాల్లో విలన్ పాత్రకు సరిపోతారేమో : హరిరామజోగయ్య
రెండేళ్లలో అమూల్ సంస్థ లక్షలాది లీటర్లు సేకరించి కోట్లాది రూపాయలు రైతులకు చెల్లించిందని తెలిపారు.అమూల్ వల్ల ప్రైవేట్ డెయిరీలు కూడా రైతులకు పాల ధరలు పెంచాయని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు ఈ మేలు జరిగిందని వెల్లడించారు.చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసిన మేలు శూన్యమని విమర్శించారు.కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. కుప్పానికి ఏమీ చేయని వ్యక్తి చంద్రబాబు..ఆయన ఇల్లు కట్టుకుంటే అడ్డుకుంటున్నారని అనవసంగా మాపై నెపం వేస్తున్నారన్నారు.ప్రభుత్వ, సహకార రంగంలో 54 సంస్థలు చంద్రబాబు మూసివేయించారని ఆరోపించారు. చంద్రబాబు దత్త పుత్రుడును ఎప్పుడు ఎందుకు ఎలా వదులుతాడో ఎవరికీ తెలియదు అంటూ ఎద్దేవా చేశారు.
ఒకరు వెన్నుపోటు వీరుడు, మరొకడు ప్యాకేజీ సూర్యుడు…ఇద్దరూ కలిసి మోసం చేస్తున్నారు…దోచుకోవడం, పంచుకోవడం, తినడం వీరికి కావాలి..ఇప్పుడు నేను చేస్తున్నది.. అప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేదు..? అని ప్రశ్నించారు.ఆ ఇద్దరూ నాన్ రెసిడెన్స్ వ్యక్తులు… ప్రతిదాన్నీ ఆడ్డుకుంటారు.చనిపోయినా ప్రజల గుండెల్లో బతకాలని మళ్లీ అధికారం కోరుకుంటున్నాను.తోడేళ్ళు ఏకం అవుతున్నాయి..తప్పుడు ప్రచారాలు నమ్మకండి అంటూ సూచించారు.
Minister Jogiramesh: వంగవీటి రంగా పేరును వాడే అర్హత వైఎస్సార్ అభిమానులమైన మాకే ఉంది ..