YSR Rythu Bharosa: నేడు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు.. ఆళ్లగడ్డలో బటన్ నొక్కి విడుదల చేయనున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం నిధులు నేడు అన్నదాతల ఖాతాల్లో జమకానున్నాయి. సోమవారం ఆళ్లగడ్డలో జరిగే బహిరంగ సభ వేదికద్వారా సీఎం జగన్మోహన్‌రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.

YSR Rythu Bharosa: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం నిధులు నేడు అన్నదాతల ఖాతాల్లో జమకానున్నాయి. సోమవారం ఆళ్లగడ్డలో జరిగే బహిరంగ సభ వేదికద్వారా సీఎం జగన్మోహన్‌రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్‌ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఒక్కో రైతుకు 4వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 50.92లక్షల మంది రైతులకు రూ. 2,096,04 కోట్ల రైతు భరోసా సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

YSR Rythu Bharosa Funds : రైతులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. 15న ఖాతాల్లోకి డబ్బులు

రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ప్రతీయేటా మూడు విడతల్లో ప్రభుత్వం రూ. 13,500 సాయంగా అందజేస్తోంది. మూడు విడతల్లో ఈ నగదు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. వరుసగా నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని మే నెలలో ఖరీఫ్ ముందే రూ. 7,500 చొప్పున ప్రభుత్వం అందజేసింది. అక్టోబర్ లో ప్రతీయేటా పంట కోతలు, రబీ అవసరాల కోసం రూ.4వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది. దీంతో ఈ ఏడాది రెండవ విడత కింద రూ.4వేల సాయాన్ని నేడు సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఇక, మూడవ విడత నిధులు సంక్రాంతి సమయంలో మరో రూ. 2వేల సాయాన్ని ప్రభుత్వం అందజేయనుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సీఎం జగన్ సోమవారం ఆళ్లగడ్డలో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఆళ్లగడ్డ చేరుకుంటారు. 12.10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడే రైతు భరోసా – పీఎం కిసాన్ నగదు బదిలీని బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జగన్ జమ చేస్తారు. మధ్యాహ్నం 12.35 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి జగన్ బయలుదేరి వెళ్తారు.

ట్రెండింగ్ వార్తలు